సెటైర్: చినబాబు ని భయపెడుతున్న పవన్ ?

అకస్మాత్తుగా జనసేనుడు ఏపీ రాజకీయాల్లో రీ ఎంట్రీ యాక్టివ్ అయిపోవడం, నానా హంగామా చేస్తూ , అధికార పార్టీ వైసిపికి ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్లుగా వ్యవహరిస్తూ బిజెపి అండదండలతో మరింత ఉత్సాహంగా ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున సెటైర్స్ వేస్తూ హడావుడి చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏపీలో విగ్రహాలపై దాడులు వ్యవహారం చోటు చేసుకోవడం బాగా పవన్ కు కలిసి వచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్నిటిపైనా విమర్శలు చేస్తూ,  చేయాల్సిన హంగామా అంతా చేస్తున్నారు. ఒకరకంగా జనసేనాని పర్యటనలతో ఆ పార్టీలో రాజకీయంగా ఊపు వచ్చింది. కానీ ఆ ఊపుతో అధికారపార్టీ వైసిపి కంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ముఖ్యంగా చిన బాబు లోకేష్ పవన్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. 



తాను వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, పార్టీలోనూ జనాలలోనూ పట్టు పెంచుకుందామని చూస్తుంటే, పవన్ అకస్మాత్తుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ,తనను డామినేట్ చేసే విధంగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడుతున్నారు అనేది చినబాబు అభిప్రాయమట. తన తండ్రి చంద్రబాబు 70 ఏళ్లు దాటిన జనాల్లో ఉత్సాహం గా తిరిగేస్తూ హడావుడి చేస్తున్నాడు.  అయినా తాను మాత్రం సోషల్ మీడియాలో హీటు పెంచే కార్యక్రమాన్నిపెంచి జనాల నోట్లో నానుదాము అని చూస్తున్నా, ఆ  అవకాశం లేకుండా ఇప్పుడు పవన్ అడ్డం పడుతున్నారు అనేది లోకేష్ బాధ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఇప్పుడు విగ్రహాల ధ్వంసం అని, దివిస్ పరిశ్రమ అంటూ పవన్ హడావుడి చేస్తూ ,మొత్తం జనాలను ఆయన వైపు తిప్పుకుంటూ రాజకీయం చేస్తుండడం చంద్రబాబు కు ఎక్కడలేని బాధ కలిగిస్తోంది. 



ఒకవైపు పార్టీలో అచ్చెన్న పెత్తనం ఎక్కువైపోయి రాజకీయంగా తనకు అవకాశం లేకుండా చేస్తున్నారని బాధ పడుతున్న సమయంలోనే పవన్ వ్యవహరిస్తున్న తీరు చినబాబు కి ఇబ్బందికరంగా మారిపోయింది.ఆ  ఇబ్బందులను అధిగమించి జనాల్లోకి వచ్చి పట్టు పెంచుకుందామని చూస్తున్నా, కరోనా లో రక రకాల వైరస్ ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో, జనాల్లోకి రావాలంటేనే చిన్నబాబు భయపడిపోతున్నారు.ఇప్పుడు పవన్ రాజకీయంతో చిన బాబు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. రాజకీయ అవకాశం ఉండదేమో అని భయపడిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: