సెటైర్ : వకీల్ సాబ్ కాదు షకీలా సాబ్ ! పేలిన గుడివాడ గన్
అమాంతం గుడివాడ నడిబొద్దికి వెళ్లి మరీ ... నీ ఊరొచ్చా .. నీ ఇంటికొచ్చా .. నీ నట్టింటికి వచ్చా అని బాలయ్య బాబు డైలాగు గుర్తు చేసుకుని ఆవేశంగా కొన్ని డైలాగులు పేల్చేసాడు. అవేంటి అంటే... ? " ఏదైనా ప్రశ్నిస్తే ఒక్కొక్కరు బూతులు తిడుతూ ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి ? నానియా ? వైసిపిలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడిలింగం. అనేక మంది నాని లలో ఒకరైన నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్ కు చెప్పండి. జగన్ రెడ్డి గారికి వకీల్ చెప్పాడని చెప్పండి. వచ్చే శాసనసభ సమావేశాల్లో గా నష్టపోయిన రైతులకు 35 వేల పరిహారం అందించకపోతే, జనసైనికుల తో కలిసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.
అలా అర్ధం పర్థం లేకుండా తిట్టిపోస్తే అసలే ఫైర్ బ్రాండ్ నాని ఊరుకుంటాడా ? ఓ రేంజ్ లో ఉతికేసాడు. ప్యాకేజ్ స్టార్ అని, వకీల్ సాబ్ వార్నింగ్ ఇచ్చాడా ? ఆయన వకీల్ సాబ్ అనుకుంటున్నారని , కానీ ఆయనను జనాలు షకీలా సాబ్ అనుకుంటున్నారని నాని విమర్శించారు.మమ్మల్ని బోడిలింగాలు అంటున్నావ్ రెండు చోట్ల పోటీ చేసిన నువ్వే బోడి లింగం అంటూ గట్టిగానే మాటల తూటాలు పేల్చాడు వైసీపీ ఫైర్ బ్రాండ్.