సెటైర్ : జోడెద్దుల బండి అండి... విడదీయరాని బంధం అండి

జోడెడ్లు బండి అంటే.. పక్క పక్కనే ఉంటాయి. రెండు ఎద్దులు ఎక్కడికెళ్లినా కలిసి మెలిసి వెళ్తుంటాయి. అందులో ఒకటి వేరే రూట్లో వెళ్తే ... అదే రూట్లో ఇంకో ఎద్దూ నడవాల్సిందే. బౌతికంగా అవి రెండు వేరు వేరు జీవాలు అయినా కలిసే ప్రయాణం చేస్తుంటాయి. రాజకీయాలలోనూ కొంతమంది నాయకులూ, పార్టీలు వేరు వేరు సిద్ధాంతాలు, దారులు , ప్రణాళికలు ఉన్నా కొంతమంది మాత్రం జోడెద్దుల మాదిరిగా ఒకే రూట్లో వేరు వేరుగా ప్రయాణం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు సేనాని , చినబాబు కూడా అదే మాదిరిగా ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. గతంలో అంటే అప్పుడెప్పుడో వీరి మధ్య ఉన్న పొత్తు .. మిత్ర బంధాన్ని అన్నిటిని గుర్తు చేసుకుంటూ వీరు ఇప్పుడు కూడా ఒకే రూట్ ను వేరు వేరు గా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

 రాష్ట్రంలో జగనుడి ప్రభుత్వం అన్నదాతలకు ఏదో తీరని అన్యాయం ఏదో చేసింది అన్నట్టుగా వ్యవహరిస్తూ, రైతుబంధు పేరుతో సరైన సమయంలో ఆడుకుంటూ వస్తున్నా, అవేవి వీరికి పట్టవు. తుఫాను బాధిత రైతులకు పరిహారం అందించేందుకు ఒక పక్క కసరత్తు ప్రభుత్వం చేస్తున్నా... మొసలి కన్నీరు కార్చుకుంటూ... ధర్నాలు... పాదయాత్రలు... ఓదార్పు యాత్రలు అనుకుంటూ హడావుడి చేస్తూ పెద్ద ఎత్తున హీటు పెంచి చలి కాచుకుఎంఎందుకు సిద్ధం అయిపోతున్నారు.

అసలు వీళ్లకు రైతుల బాధలు ఎప్పుడూ పట్టకపోయినా, అబ్బే ... అవేమీ మాకు అవసరం లేదు. యాత్రలు .. ధర్నాలు చేస్తాం అంతా మా ఇష్టం మాతో పెట్టుకుంటే మీకే నష్టం అంటూ ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటే హడావుడి. చెప్పుకోవడానికి వేరు వేరు పార్టీలు.. వేరు వేరు సిద్ధాంతాలు అయినా ఒకటే రూట్లో వీరు వెళ్తుండడమే ఈ జోడు ఎద్దుల రాజకీయం. ఇది ఎవరికీ తెలియదనుకున్నా, అందరికీ తెలిసిన రాజకీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: