హెరాల్డ్ సెటైర్ : ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టు ప్రదక్షణిలు చేస్తాడో పాపం

Vijaya
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి మరీ దారుణంగా తయారైంది. సినిమాల్లోనే పవర్ స్టార్ కానీ నిజజీవితంలో మాత్రం ఉత్తస్టారే అని ఎప్పుడో తేలిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు కాస్తయినా పవన్ కు మర్యాద ఉండేది. ఎప్పుడైతే కమలంపార్టీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుండి పవన్ కున్న కాస్త ఇమేజి కూడా దెబ్బతినేసింది. తాజాగా ఈ నెలాఖరులో రెండు రోజుల ఢిల్లీ టూరు పెట్టుకున్నారట పవర్ స్టార్. నెలాఖరులో ఢిల్లీకి ఎందుకయ్యా అంటే ఇంకెందుకు తిరుపతి లోక్ సభలో పోటీ చేసే అవకాశం కల్పించమని అడగటానికి మాత్రమే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇఫ్పటికే తిరుపతి సీటు కేంద్రంగా రాష్ట్ర స్ధాయిలో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మంచి దూకుడుమీదున్నారు. తిరుపతి లోక్ సభ ఉన్నికల్లో పోటీ చేయబోయేది బీజేపీయే అని ప్రకటించేసి పవన్ కున్న గాలి మొత్తం తీసేశారు.ఎప్పుడైతే వీర్రాజు ఏకపక్ష ప్రకటన చేశారో అప్పుడే పవన్ కు కమలంపార్టీ ఇస్తున్న మర్యాద ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ఉపఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై రెండుపార్టీల నేతలతో కమిటి వేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కమిటి గురించి ప్రకటించి చాలాకాలమే అయినా ఇంతవరకు కమిటిని నియమించలేదు. కమిటిని వేసి ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయం డిసైడ్ చేయకుండానే బీజేపీనే పోటీ చేస్తుందని వీర్రాజు ప్రకటేంచేశారంటేనే ఆ పార్టీ పవన్ కు ఇస్తున్న విలువేంటో అర్ధమైపోతోంది. ఇంతోటిదానికి మళ్ళీ మిత్రపక్షమని పవన్ ఊగులాడుతున్నారు. నిజానికి రెండుపార్టీలకు జనాల్లో పెద్ద ఆదరణ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.ఇటువంటి నేపధ్యంలో పవన్ రెండు రోజులపాటు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఉపఎన్నికల్లో పోటీ విషయమైతే ప్రత్యేకించి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఉపఎన్నిక విషయం కాకుండా ఢిల్లీస్ధాయి నేతలతో చర్చించేందుకు పవన్ కు వేరే అంశమే లేదు. మొన్నటి పర్యటనలో రాష్ట్రప్రయోజనాల గురించి నడ్డాతో మాట్లాడినట్లు చెప్పి పవన్ భలే కామిడి చేశారు. రాష్ట్రప్రయోజనాలపై నడ్డాతో పవన్ చర్చించారంటే నమ్మేంత అమాయకులు ఎవరు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రప్రయోజనాలపై కేంద్రమంత్రులే పెద్దా స్పందించటం లేదు. అలాంటిది నడ్డా ఏమి స్పందిస్తారు ? చెప్పుకోవటానికి మాత్రమే ఈ కారణం పనికొస్తుంది కానీ అసలు విషయం తిరుపతి లోక్ సీటు విషయమే అని అందరికీ తెలుసు. కాకపోతే నడ్డా నుండి ఎటువంటి హామీ రాలేదు కాబట్టి రాష్ట్రప్రయోజనాలని, రెండుపార్టీలతో కమిటి అని నడ్డా చెప్పినట్లు మీడియా ముందు పవన్ కలరింగ్ ఇచ్చారు. మరి ఈసారేమి చెబుతారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: