ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవాలని కోరిక పవన్ లో ఎక్కువ కనిపిస్తున్నా, ఆ కోరిక తీరే మార్గమే కనిపించడం లేదు. ఏదో చెప్పుకోవడానికి బిజెపి తో పొత్తు ఉన్నా, ఆ పొత్తుతో పాతుకు పొదాము అని ఎదురు చూపులు చూస్తున్నా... ఆ ఎదురుచూపులు మాత్రమే మిగులుతున్నాయి. తప్ప ఉపయోగం లేదు అన్నట్లుగా తయారైంది అసలు ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న పవన్ ను పట్టించుకోనట్టు బిజెపి పెద్దలు వ్యవహరిస్తుండడం, పొత్తు పెట్టుకున్న రోజు నుంచి కనీసం శాలువా కప్పి , సన్మానం చేయకపోవడం, కనీసం బిజేపి పెద్ద తలకాయలను కలిసి తన బాధ, తన భక్తి చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా, కనీసం పలకరించేవారు లేకపోవడం వంటి కారణాలు చాలా ఆవేశాన్ని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అయినా అన్ని అవమానాలు తట్టుకుంటూనే పార్టీ కోసం ఎంతో త్యాగం చేస్తున్నారు.
కానీ ఆ త్యాగానికి తగిన ప్రతిఫలం మాత్రం కనిపించడం లేదు. గ్రేటర్ లో పోటీ చేద్దామని చూసినా, జనసేన ను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోనీ తిరుపతిలో పోటీ చేద్దాం అని చూస్తున్నా, అక్కడ కూడా పోటీ చేస్తామని బిజెపి మంకు పట్టు పట్టేసింది. అసలు తమను బిజెపి ఎందుకు పట్టించుకోవడం లేదు అని బాధగా, భయంగా ఆరా తీస్తున్న పవన్ కు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలుస్తున్నాయి. అప్పుడెప్పుడో మాత్రమే కాదు... ఇప్పటికీ తమ రాజకీయ శత్రువులు బాబుతో బహిరంగంగానే రహస్యంగా నో, పవన్ అంటకాగుతూ వస్తున్నా రేమో అన్న అనుమానాలు బిజెపికి ఉన్నట్టు కనిపిస్తున్నాయి అసలు ఆ అనుమానంతోనే పవన్ తో అంటి ముట్టనట్టుగా బిజెపి వ్యవహరిస్తోంది అనేది అందరూ అనుకునే మాట.
బీజేపీతో పొత్తు అనేది లేకపోతే వెంటనే పవన్ ను చేరదీసి పొత్తు పెట్టుకునేందుకు బాబు ఎప్పుడూ కాచుకునే కూర్చుంటాడు. పవన్ తమ తో కలిస్తే తమకే అధికారం దక్కుతుంది అనేది బాబు, ఆ పార్టీ నాయకులకు ఉన్న అభిప్రాయం. ఇప్పుడు కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన కు కలిసి వచ్చేది ఏమీ కనిపించడం లేదు. పైగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఏదో రోజు ఈ అవమానాల పై ఎర్ర జెండా ఎగురవేసి ,సైకిల్ పై సవారి చేసేందుకు కూడా పవన్ వెనకాడబోరు అనేది కూడా ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న అభిప్రాయం.