సెటైర్ : ఈ ప్రచార పిచ్చి ఏంటయ్యా బాబు ?

తాను, తన పార్టీ వాళ్ళు తుమ్మిన, దగ్గినా ,తిట్టినా, పొగిడినా, మీడియాలో బొమ్మ కనపడాలి. ఒక్క రోజు బొమ్మ కనపడకపోయినా మైండ్ తిరిగిపోద్ది.  రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడ కు వాలిపోయి మీడియాలో హైలెట్ అవ్వడం నట విశ్వరూపం చూపించడం ... ఆయన కాబట్టి ఇంతగా కష్టపడుతూ, అధికారంలో లేకపోయినా జనాలపై పిచ్చి ప్రేమ పెంచుకొని ,పగలనక రాత్రనక కష్టపడి పోతున్నట్లుగా సొంత కుల మీడియాలో హైలెట్ అయ్యే విధంగా చేసుకుంటూ హడావుడి చేయడం ఇప్పుడు కాదు మొదటి నుంచి బాగా అలవాటైపోయింది . పావలా పనికి పది రూపాయల ప్రచారం చేసుకోవడం కూడా బాగా అలవాటు అయిపోయింది. అధికారం లేకపోయినా ఉన్నట్టుగానే భ్రమపడుతూ, అందరినీ  భయపెడుతూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారంలో తాను తప్ప మరెవరు ఉండకూడదని, సీఎం కుర్చీ అనేది తనకే రాసి పెట్టి ఉంది అని,  అసలు జనాలు నన్ను గెలిపించకుండా  ఇంటికి పంపించి పెద్ద తప్పు చేశారని , అదో గొప్ప ఘనకార్యం గా తన భజన మీడియాలో ప్రచారం చేసుకోవడం బాగా బాగా అలవాటు అయిపోయింది.




 అసలు మీడియా లో ఫోకస్ ఎలా ? ఏ విధంగా ప్రచారం చేసుకుంటే లబ్ధి పొందాలి అనే విషయంలో పీహెచ్ డీ చేసిన వ్యక్తిగా.. ఆ ఫార్ములాను ఉపయోగించి నిత్యం ఏదో ఒక అంశంపై హడావుడి చేస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ చేస్తున్న హడవుడి అంత ఇంత కాదు. ప్రతి పనికి అడ్డం పడడమే కాకుండా, చిన్న చిన్న లోపాలను తన భజన మీడియా సహకారంతో హైలెట్ చేసుకుని లబ్ధి పొందడం ఆనవాయితీగా మారిపోయింది . ఇటువంటి కాకి లెక్కలు వేసుకుని ... ఈ భజన మీడియా ను నమ్ముకుని 2019 ఎన్నికల్లో అడ్డంగా బుక్కయినా, అధికారానికి దూరం అవ్వడమే కాకుండా, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభాన్ని ఇప్పుడు పార్టీకి దక్కేలా చేశారు.



 ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకుని.. నిజానిజాలు తెలుసుకుని పార్టీని ఒడ్డున పడేస్తారు అని ఆ పార్టీలోని నాయకులు చూస్తున్నా , ఇప్పటికి అదే భజన మీడియా తో రాజకీయాలు చేస్తూ మరింత అభాసుపాలు అవుతున్నారు. ఇదంతా ఎవరి గురించా అనుకుంటున్నారా ? ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్ధమయిపోయి ఉంటుంది !!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: