సెటైర్ : ఆ పార్టీని ఎవరూ నాశనం చేయక్కర్లే ..! సొంతోళ్లు చాలుగా ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేయడానికి , అసలు తెలంగాణ కాంగ్రెస్ అనే పదం మర్చిపోయేలా చేయడానికి ఎవరో రాజకీయ ప్రత్యర్థులు ఏవేవో కుట్రలు కుతంత్రాలు, రాజకీయ వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు ఏమి చేయక్కర్లేదు. అసలు ఆ అవకాశమే వేరొకరికి ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడరు. ఆ పార్టీలోని నాయకులు. కాంగ్రెస్ ను ఏ విధంగా అయితే బాగా కోలుకోలేని విధంగా దెబ్బ తింటుందనే విషయం ఆ పార్టీ నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికలే కాదు, హుజురాబాద్ ఉప ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికలు, త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఏది జరిగినా, కాంగ్రెస్ మాత్రం అధికారం దక్కించుకోవడం అనేది జరగని పని అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. 



అసలు తెలంగాణలో ఉనికి లేని బీజేపీ సైతం ఇప్పుడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి, గ్రేటర్ సవాల్ విసిరి పారేసదుకు సిద్ధమవడం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది . అయినా కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. అసలు వచ్చేలా కూడా కనిపించడం లేదు. అసలు పార్టీ మునిగి పోయే లా ఉందిరో ... ఎవరైనా కాపాడండిరో అంటూ నెత్తి నోరు బాధుకుంటున్నా, కాపాడేందుకు అధిష్టానం కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే అసలు ఏదో రకంగా తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టిస్తారనే ఉద్దేశంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం చేపడతామని , ఆ పార్టీ అధిష్టానం ఎదురు చూపులు చూస్తున్నా, ఇప్పటికే కొంత మంది పేర్లను ఫైనల్ చేసుకున్నా, ఏ మాత్రం కుదరదని పని అని అని, పార్టీలో నాయకులు తెగ హడావుడి చేసేస్తున్నారు. 



ఆ రేవంత్ కో మరొకరు అధ్యక్ష బాధ్యతలను అప్పగించి, ఏదో రకంగా పార్టీ  ఇక్కడ యాక్టివ్ గా ఉంది అని గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నిద్దాం అనుకున్నా, అది కుదరని పని అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి తయారైంది. ఎక్కడో పార్టీ నాయకులు సీక్రెట్ గా పెట్టుకున్న సమావేశంలో, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, అర్థం ఉండేది. కానీ అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఒకరిపై ఒకరు సొంత పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటూ ప్రత్యర్థులకు తమను విమర్శించే అవకాశం ఇవ్వమని, మేము ఎప్పటికీ మారము అని, పార్టీ ఇప్పుడున్న పరిస్థితి కంటే దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినా పరవాలేదు అన్నట్లుగానే నాయకులు వ్యవహరిస్తుండడంతో అసలు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు అని, కాంగ్రెస్ ను నాశనం చేయడానికి సొంత పార్టీ నాయకులు సరిపోతారని సెటైర్లు వేస్తున్నా , ఏ మాత్రం ఎవరూ లెక్క చేసే పనిలో లేరు. ఏం చేస్తాం జరిగేది చూస్తూ ఊరుకోవడం తప్ప అంటూ పార్టీలోని మరికొందరు నిట్టూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: