హెరాల్డ్ సెటైర్ : జగన్ లేఖ తర్వాత న్యాయవాదుల్లో చీలిక ? ఎల్లోమీడియా పుణ్యమేనా ?

Vijaya
న్యాయవ్యవస్ధలోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ దేశంలో సంచలనాలు రేపుతోంది.  జగన్ చేసిన ఆరోపణల విషయంలో న్యాయవాదులు, న్యాయమూర్తుల్లోనే చీలిక వస్తున్నట్లుంది. ఢిల్లీ బార్ అసోసియేషన్ లో మొదలైన తాజా పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుత పరిస్దితికి ఎల్లోమీడియానే పుణ్యం కట్టుకుందనే ఆరోపణలు కూడా చాలా జోరుగా సాగుతోంది.  నిజానికి జగన్ చేసిన ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అడగాల్సిందిపోయి అసలు జగన్ లేఖ రాయటమే తప్పని, ఆరోపణలు చేసినందుకు జగన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, జగన్ను ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ బార్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ పాండే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి లేఖ రాయటమే విచిత్రం అనిపించింది.



సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగుగు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ తన లేఖలో ఆరోపించారు. వీరంతా చంద్రబాబునాయుడు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు  తన లేఖలో ఆధారాలను కూడా అందించారు. నిజానికి జగన్ రాసిన లేఖలోని అంశాలు తప్పా ? ఒప్పా ? అని తేల్చాల్సిందే బాబ్జే మాత్రమే. అయితే ఆశ్చర్యంగా జగన్ చేసిన ఫిర్యాదుతో ఎటువంటి సంబంధం లేని బార్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ పాండే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా  చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీన్ని ఇఫుడు ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే తీవ్రంగా ఖండించారు.  జగన్ కు వ్యతిరేకంగా ఢిల్లీ బార్ అసోసియేషన్ సమావేశంలో తీర్మానం చేయటాన్ని దవే వ్యతిరేకించారు. ’జగన్ రాసిన ఆరోపణల్లోని అంశాలపై మనకు ఏమి తెలుసని ఖండించారం’టూ మండిపోయారు. ’లేఖలోని ఆరోపణలపై విచారణ జరిపితేనే వాస్తవాలు ఏమిటో బయటపడతాయన్న దవే, జగన్ కోరుకుంటున్నది కూడా ఇదే కదా’ అంటూ నిలదీశారు.



సుప్రింకోర్టుతో పాటు న్యాయవ్యవస్ధపైన ఉన్న అనేక ఆరోపణలను దవే  గుర్తుచేశారు. ఎప్పుడు ఆరోపణలు వచ్చినా ఏదో రూపంలో సర్దుబాటు చేయటం తప్ప నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రకటించలేదన్నారు. అన్నీ వ్యవస్ధలోకి పారదర్శకత లేని వ్యవస్ధ ఏదన్నా ఉంటే అది న్యాయవ్యవస్ధ మాత్రమే అంటు బార్ అసోసియేషన్ కు ఘాటుగా లేఖ రాశారు.  ఇదే సందర్భంలో జగన్ రాసిన లేఖపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేయటంతో బార్ అసోసియేషన్ తో పాటు ఢిల్లీ, సుప్రింకోర్టులో సంచలనంగా మారింది. జగన్ రాసిన లేఖ విషయంలో కార్యదర్శి రోహిత్ పాండే-అధ్యక్షుడు దుష్యంత్ దవే వర్గాలుగా న్యాయవాదులు చీలిపోయారట. రోహిత్ రాసిన లేఖను వ్యతిరేకిస్తున్న వారంతా దవే వైపు చేరుతున్నట్లు సమాచారం.



నిజానికి జగన్ రాసిన లేఖ విషయంలో పాండేకయినా దవే కయినా పూర్తి విషయాలు తెలియవనే చెప్పాలి. తనకు సంబంధం లేకపోయినా పాండే ముఖ్యమంత్రి లేఖపై స్పందించారంటే అది కేవలం ఎల్లోమీడియా వల్లే అనుకోవాలి. ఎందుకంటే జగన్ రాసిన లేఖకు వ్యతిరేకంగా ఎల్లోమీడియా ఓ ఉద్యమం లాగ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్వీ రమణకు మద్దతుగా చంద్రబాబు కోసమే ఎవరెవరితోనో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడించి మొదటి పేజీల్లో అచ్చేస్తోంది. దవే రాసిన లేఖలో  జగన్ చేసిన ఫిర్యాదులోని అంశాల గురించి మనకేమీ తెలియదు అనే చెప్పారు. కాబట్టే ఫిర్యాదులపై చీఫ్ జస్టిస్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  ఆరోపణలు తప్పని తేలితే జగన్ పై ఏదో ఓ యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి.  అదే ఆరోపణల్లో నిజాలున్నాయని బయటపడితే అప్పుడు ఏమి చేస్తారు అన్నదే ఇఫుడు ప్రశ్న. ఈ విషయాన్నే దవే ప్రస్తావించారు. ఏదేమైనా ఎల్లోమీడియా పుణ్యామా అని ఢిల్లీ బార్ అసోసియేషన్ లో  చీలిక వచ్చేసినట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: