సెటైర్ : రాజు గారు.. నెక్స్ట్ బాబు గారు.. ఆ నెక్స్ట్ అబ్బాయ్ గారు ?
సరే ఇంతకీ ఆ జగన్ మోదీ ఇద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం ఏంటయ్యా అంటే ..? మీకు మేము మాకు మీరు ఇద్దరం చక్కగా ఒక మాట మీదే నిలబడాలి , కూర్చోవాలి అని డిసైడ్ అయిపోయారు. సరే నువ్వు మాకు సపోర్ట్ చేస్తాను అంటున్నవ్ కదా ఓ రెండో మూడో మంత్రి పదవులు కూడా ఇస్తాను తీసుకోవోయ్ అని చెప్పడమే కాదు నీ కోరికల చిట్టా ఉంటే చెప్పు తీర్చిపారేస్తా అంటూ హామీ కూడా ఇచ్చేయడంతో ... సార్ సార్ ఆ చంద్రబాబు ఉన్నాడు చూసారు... ? మహా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి ... ఆయనే కాదు మా పార్టీలో గెలిచి ఇప్పుడు మమ్మల్నే తిట్టిపోస్తున్న మా గోదావరి రాజుగారితో పెద్ద తలనొప్పి అయిపోయిందండి బాబు. ప్రతి దాంట్లో యేలెట్టి మరీ ... అబ్బో అబ్బో చెప్పలేమండీ ఆయన మమ్మల్ని పెట్టే బాధలు అని చెప్పుకుని వచ్చేసారు.
ఇక చూస్కోండి ఇప్పుడేమో రాజు గారు రాజుగారు మా అప్పుల సంగతి ఏంటమ్మా ? అంటూ ఎప్పుడో అప్పులు ఇచ్చి , ఇవ్వకపోతే కేసులు పెట్టిన బ్యాంకోళ్లు అంతా ఫిర్యాదులు చేసేస్తే అప్పుడు పట్టించుకోని సీబీఐ వొళ్లు ఇప్పుడు రాజుగారు మీ ఆస్తుల, అప్పుల లెక్కలేంటి అంటూ ఇంట్రాగేషన్ చేసేస్తున్నారు. జస్ట్ ఇదంతా శ్యాంపిలే. అసలు పెద్దమనుషులు బాబోరు , బుల్లి బాబోరు మీద కూడా విచారణ చేసేసి బై బై బాబు అని చెప్పించి ఊచలు లెక్కపెట్టిస్తారట. అప్పుడెప్పుడో జగన్ జైలుకు వెళ్తే సంబరాలు చేసుకున్న వారంతా ఇప్పుడు జైల్లో జూమ్ మీటింగ్ లు గుర్తు చేసుకునేలా చేసేయాలని ఆ జగన్ ఈ మోదీ ఒకటే కంగారు గా ఉన్నారట.