సెటైర్: పరదేశి.. అజ్ఞాతవాసి .. తెలంగాణ నివాసి ! ఈ మాజీ తమ్ముడికి ఎంత ఎటకారమో !! ??

గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టుగా తయారయిపోయింది బాబు గారి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న స్థితి , దుస్థితి చూస్తే అందరికీ అలుసయిపోయినట్టు ఉంది. అసలే వయసయిపోయినా, పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా సైకిల్ తొక్కుతూ కష్టపడుతుంటే.. ఆ కష్టాన్ని అస్సలు గుర్తించకుండా ఎవరికి వారు ఎటకారం ఆడుతున్నారో చూస్తుంటే మా మాబోబోరికి ఎక్కడో కాలిపోతోంది. పార్టీలో ఉన్నోల్లు, ఎల్లినోళ్లు, అధికారంలో ఉన్నోల్లు.. అధికారం కోసం పోరాడేవాళ్లు, ఫేచుబుక్కుల్లో తలలుపెట్టి చుస్తున్నోళ్లు అందరికి బాబోరు అంటే ఎటకారం అయిపొయింది. అసలు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనే గౌరవం ఒక్కడంటే ఒక్కడికి లేదు. అసలు బాబొరి మాటే శిలా శాసనం అన్నట్టు ఉండేది. మరి ఇప్పుడో ..? ఎవరికీ లెక్కేలేదు.

బాబోరు ఆయనగారి గారాల పుత్రుడు లోకేశం బాబు అంటే మరీ క్యామిడీ అయిపోయింది. అయినదానికీ కానీ దానికి అందరూ తిట్టిపోసేవాళ్ళే. అబ్బబ్బా అందరితోనూ మాటలనిపించుకోవడం అలవాటయిపోయింది ఆయనకు, ఆయనగారి కొడిక్కి. సర్లే గాని ఆ మధ్య గన్నవరం లో తెలుగు తమ్ముడు వంశీ సైకిల్ దిగేసి వెళ్ళిపోయాడు గుర్తుంది కదా ? అప్పుడు ఎన్నేసి మాట్లాన్నాడో. బాబొరినే కాదు ఆయన వారసుడి ని కూడా తిట్టిపోసేసాడు. ఏంటయ్యా బాబు మరీ ఇంత చీప్ అయిపోయావ్ అని అప్పట్లో చాలామంది ఓదార్చర్లే. సరి సర్లే మేమేమి వద్దనుకోలేదు.. అయినా వెళ్ళిపోయాడు. ఇక ఏ ఇబ్బంది ఉండదులే అనుకుంటుంటే మళ్ళీ ఇలా తగులుకున్నాడు ఏంటయ్యా బాబు..?

ఏదో కరోనా భయం వేసి హైదరాబాద్ ప్యాలస్ లో సకుటుంబ సపరివార సమేతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటే ..? దానిక్కూడా ఆడిపోసుకోవాలా ? ఏమన్నాడు ఏమన్నాడు ..? " ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి " పరదేశి " " అజ్ఞాతవాసి " తెలంగాణ రాష్ట్ర "నివాసి " మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం సుస్వాగతం '' అంటూ అంత ఎటకారం ఆడుతాడా  ఆ గన్నవరం మాజీ తమ్ముడు...? మరీ అంత అలుసయిపోయాడా మా బాబోరు ? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: