హెరాల్డ్ సెటైర్ : జగన్ పై ఏమి రాయాలో ఎల్లోమీడియాకు అర్ధం కావటం లేదా ? మరీ ఇంత అయోమయమా ?

Vijaya
ఆంధ్రజ్యోతిలోను, ఏబిఎన్ ఛానల్లోను వస్తున్న కథనాలు చూస్తుంటే యాజమాన్యం పూర్తి అయోమయంలో ఉన్న విషయం అర్ధమైపోతోంది. మామూలుగా ఎక్కడైనా ప్రభుత్వంలో తప్పు జరిగితే దాన్ని ఎంగడట్టడం వేరు. ఇది నాఖార్సయిన జర్నలిజం. కానీ ఏమి జరగకపోయినా లేదా చాలా చిన్న విషయాన్ని కూడా సాగదీసి బూతద్దంలో చూపించటం, పదే పదే వ్యతిరేక కథనాలు ఇవ్వటం ఎల్లోజర్నలిజం. జగన్ విషయంలో పైన చెప్పిన మీడియా చేస్తున్నది ఇదే. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా పాలసీ అయితే మారలేదు కాబట్టే జగన్ దీన్ని ఎల్లోమీడియా అంటున్నది. సరే రాస్తున్నది, చూపుతున్నది ఎలాగూ వ్యతిరేకమే కాబట్టి దన్నైనా పద్దతి ప్రకారం చేస్తున్నారా అంటే అదీ లేదు. ఒకరోజు రాసిన వ్యతిరేక కథనాలకు మరుసటి రోజు పూర్తి వ్యతిరేకతంగా ఇస్తున్నారు. దీంతోనే జగన్ పై ఏమి రాయలనే విషయంలో ఎల్లోమీడియాకు అర్ధం కావటం లేదనే విషయం జనాలకు అర్ధమైపోయింది.



తాజాగా ఆదివారం రాసిన కొ(చె)త్తపలుకునే చూద్దాం. మూడు రోజుల క్రితం అమిత్ షా-జగన్ భేటి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ భేటిలో న్యాయవ్యవస్ధ విషయంలో  జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అమిత్ చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. జగన్ కు అమిత్ షా  ఈ విషయంలో పెద్ద క్లాసే తీసుకున్నట్లు పదే పదే డిబేట్ లోను మరుసటి రోజు పత్రికలో బ్యానర్ కథనంగాను ఇచ్చుకున్నారు. ఇలా తమ బుర్రలోకి ఏది తోస్తే అదల్లా డిబేట్ లో చెప్పేసి, మరుసటి రోజు అచ్చేసి తృప్తి పడ్డారు.



తీరా ఈరోజు చెత్తపలుకులో ఇదే విషయమై రాసిన రాతలు చూస్తే అమిత్ షా ను జగన్ లెక్కే చేయలేదన్నట్లుగా రాశారు. న్యాయవ్యవస్ధపై ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతూ అమిత్ షా మాట్లాడాడట. పద్దతిని మార్చుకోమని సూచించినట్లు రాశారు. అయితే జగన్ బదులిస్తు ఇంతదూరం వచ్చిన తర్వాత ఇక వెనక్కు తగ్గేది లేదని స్పష్టంగా చెప్పేశాడని రాశారు. అంటే అర్ధమేంటి ? అమిత్ షా మాటలను జగన్ లెక్క చేయలేదనే కదా అర్ధం. ఈరోజు రాసిన రాతలు కరెక్టే అయితే మొన్న రాసిన రాతలన్నీ అబద్ధాలని ఒప్పుకోవటమే కదా. పైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై రాష్ట్రప్రభుత్వం కోరిన విధంగా సిబిఐతో విచారణ చేయించాల్సిందే అంటూ జగన్ వాదించినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది.



మూడు రోజుల క్రితం రాసిన రాతలకు తాజాగా చెత్తపలుకులో రాసిన రాతలు ఎంత వ్యతిరేకంగా  ఉందో అందరు గ్రహించవచ్చు.  జగన్ విషయంలో ఇలా పరస్పర విరుద్ధమైన రాతలను ఎల్లోమీడియా ఎందుకు రాస్తున్నట్లు ? ఎందుకంటే రాయటానికి అక్కడ ఏమీ లేదు కాబట్టే. అమిత్ షా-జగన్ భేటిలో జగన్ పై ఏదో విధంగా వ్యతిరేక వార్తలు రాయాలని ముందే డిసైడ్ అయిపోయింది. అందుకనే ఏమి లేకపోయినా లేకపోతే ఏమి జరిగిందో తెలియకపోయినా సరే తాము మాత్రం విరుద్ధంగానే కథనాలను వండి వార్చేసింది. దినుసులుంటే ఏ విధంగా అయినా వంట చేయచ్చు. ఎటువంటి దినుసులు లేకుండానే వంట చేయాలంటే అందులోను ప్రత్యక వంటకాలు చేయాలంటే ఎలా ? ఇపుడు ఎల్లోమీడియా పరిస్ధితి ఇదే. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా చేస్తున్న  వంటలన్నీ కంపు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: