సెటైర్ : హమ్మయ్య ! లోకేష్ ఇక జనాల్లో తిరగక్కర్లే ? అలా సెట్ చేశాడు మరి

చినబాబు ఆయన సన్నిహిత వర్గం సంబరాలు చేసుకునే చల్లటి కబురు మెల్లిగా లీక్ చేశారు పెద బాబు. ఏపీ తెలుగుదేశం బరువు బాధ్యతలు మొత్తం అచ్చెన్న భుజానికి ఎత్తేసి, చంద్రబాబు పెద్ద బరువు దించుకోబోతున్నారు. ఇప్పటివరకు పార్టీని మోసి మోసి భుజాలు నొప్పి పెట్టిన బాబు కు ఈ రకంగానైనా  విశ్రాంతి దొరికిందని, ఆ పార్టీ వాళ్లు అనుకుంటే, ఆయన కుమారుడు  మాత్రం తాను  ఎండలో, వానలో జనాల్లో తిరిగే పనిలేకుండా మా నాన్నరు భలేగా బరువు బాధ్యతలన్నీ తెలివిగా, అచ్చెన్న కు ఇస్తున్నారు అని, ఇక తాను తిరిగినా, తిరగక పోయినా, అన్ని తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు భరిస్తానని, హాయిగా సింహాసనం ఎక్కి కూర్చోవడం ఒకటే మన పని అని  లోకేష్ బాబు మహా ఆనందంగా ఉన్నారట. 


అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అయినా ఇంటి గడప దాటి బయటకు వస్తుంటే, లోకేష్ మాత్రం ఇంకా విశ్రాంతి లోనే గడిపేస్తున్నారు. మనకెందుకు లే అని గడపదాటి వచ్చేందుకు అస్సలు ఇష్టపడం లేదు.ఇంచక్కా బాబు అన్ని భరిస్తూ రావడంతో, ఏ నొప్పి లేకుండానే లోకేష్ బాబు రెస్ట్ తీసుకుంటూ గడిపేస్తున్నారు. ఆ మధ్య కాస్త బరువు తగ్గి జనాల్లోకి వచ్చి.  అందరికీ షాక్ ఇచ్చిన చిన బాబు.. ఈసారి మాత్రం అన్ని విషయాల్లోనూ బాగా ఆరి తెరి యుద్ధవిద్యలు అన్ని నేర్చుకుని జనాల్లోకి రావాలని చూస్తున్నారు. అసలు చంద్రబాబు ఈ టీడీపీ బరువు బాధ్యతలు చంద్రబాబుకి అప్పగించాలని చూసినా, పార్టీ నాయకుల్లో ఒక్కరికి కూడా ఆయనపై నమ్మకం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు.


 కానీ జగన్ మాత్రం ఊరుకునెలా కనిపించకపోవడం, టీడీపీ ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగాను ఇబ్బందులు పెడుతూ,  అసలు ఎవరు పోరాటం చేసినా లోపలేయించేస్థూ, అందరినీ భయపెట్టే ఇసన్నారు. ఇప్పటికే అచ్చెన్న జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు తాను మళ్లీ ఏపీ లోకి అడుగు పెడితే ఐటీ గ్రిడ్ అంటూ సిబిఐ వెంట పడే అవకాశం ఉండడం, ఆ జగన్ ఆ పార్టీ నాయకులు మళ్ళీ తనను టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉండడంతో  ఇంట్లోనే ఉండడం బెటర్ అని చిన బాబు ఆలోచన. ఇప్పుడు తన తండ్రి నిర్ణయంతో ఆ బాధలన్నీ అచ్చెన్న పడతాడని తాను చివరి నిమిషంలో ఎంట్రీ ఇస్తే సరిపోతుంది అనేది చిన బాబు ఆలోచన. అందుకే అచ్చెన్న పేరును ప్రకటించగానే ఆనందంలో చినబాబు మునిగిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: