సెటైర్ : పోరాటం తక్కువ.. ఆరాటం ఎక్కువ ! అమరావతిపై అతి ?
ఆ బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరూ అమరావతి అంటే ఊ ..ఆ అనడం లేదు. అసలు సొంత పార్టీలోనే అమరావతి అంటే ఉలుకు పలుకూ లేకుండా పోయింది. అయినా ఏదో సాధించేద్దామని ఆరాటమే కానీ, దాని వల్ల ఫలితం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. అసలు విశాఖను రాజధానిగా చేసి తీరుతామని చెబుతూ పంతం పట్టి కూర్చున్నాడు. బాబు గారేమో అమరావతి అమరావతి అని ఎంత కలవరిస్తూనే ఉన్నారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో బాబు గారికి దిమ్మతిరిగిపోయింది. అయినా ఎక్కడో ఉండి కబుర్లు చెప్పడం ఏంటయ్యా మీరు కూడా ఇక్కడికి రావాల్సిందే అని, పట్టించుకోవాల్సిందే అని గట్టిగా నిలదీస్తే, ఇప్పుడు ఏపీకి పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు.
ఎంత పరిగెట్టుకుంటూ వచ్చినా ఫలితం ఏంటి ? ఇప్పుడు ఇంటి నుంచి బయటకి వచ్చే పరిస్థితి ఉందా ? బాబు గారి జూమ్ పంచ్ డైలాగులు ఎవరైనా వింటారా ? ఆ జగన్ అస్సలు లెక్కచేస్తాడా ? చెయ్యడు. ఇది బాగా తెలుసు కదా అయినా ఏంటండి మీరు అని మొత్తుకున్నా ఫలితం లేదు. కరోనా భయంతో అల్లాడుతున్న మమ్మల్ని ఆదుకోకుండా, వీధుల్లోకి రావాలని ఆదేశాలిస్తారా ? మరి చినబాబు గారి సంగతి ఏంటి ? ఆయన మరి వీధుల్లోకి వస్తారా లేదా ? రారు కదా ఎందుకండి బాబు గారు ? మీరు విశ్రాంతి తీసుకోకుండా అది ఇది అంటూ మమ్మల్ని ఎందుకంటే రోడ్డుమీద పడేస్తున్నారు ?