హెరాల్డ్ సెటైర్ :  సెకండ్ కు ఒకరు చనిపోతున్నారట.. లెక్కంటే గణిత మేధావి చంద్రబాబుదే

Vijaya
లెక్కలు వేయాలంటే చంద్రబాబునాయుడే వేయాలి. ప్రభుత్వం మీద బురద చల్లాలంటే కూడా చంద్రబాబే చల్లాలి అన్నట్లుగా తయారైంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యవహారం. ఏపితో పాటు వివిధ రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులు, వైద్య నిపుణులతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సులో  చర్చించారు. సరే చర్చలో సహజంగానే ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశాడు. అసలు జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించిందే జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాల్లో గబ్బు పట్టించే ఉద్దేశ్యంతో. దానికి అనుగుణంగానే కరోనా వైరస్ సమస్య రాష్ట్రంలో ఎంతగా పెరిగిపోయింది, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే విషయాలపై నోటికొచ్చినట్లు ఆరోపించాడు. సరే వైరస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు మెచ్చుకుంటే హాస్చర్యపోవాలి కానీ బురద చల్లితే కొత్తగా ఆశ్చర్యం లేదు.

అయితే ప్రభుత్వంపై  బురద చల్లటంలో కూడా చంద్రబాబు తన పరిమితులన్నింటినీ దాటేయటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ చంద్రబాబు చెప్పినదేమిటయ్యా అంటే ఏపిలో సెకనుకు ఒకళ్ళు చనిపోతున్నారట. పదిసెకన్లకు ఒకరికి కరోనా వైరస్ సోకుతున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.  సెకనుకు ఓ కరోనా రోగి చనిపోతున్నాడంటే నిముషానికి ఎన్నిమంది ? 60 మందికదా.  నిముషానికి  60 మంది అంటే గంటకు ఎంతమంది ? 60 మంది X 60  నిముషాలు = గంటకు 3600 మంది చనిపోతున్నట్లు లెక్క. ఈ లెక్కన రోజుకు ఎంతమంది చనిపోతున్నట్లు ? అంటే గంటకు చనిపోతున్న 3600 మంది X 24  గంటలు = 86,400. అంటే గణితశాస్త్రంలో నోటెల్ ప్రైజ్ సాధించగలిగే స్ధాయిలో ఉన్న అపరమేధావి చంద్రబాబు లెక్కల ప్రకారం ఏపిలో రోజుకు 86, 400 మంది చనిపోతున్నారు.

మరి అంతమంది నిజంగానే చనిపోతున్నారా ?  ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి శనివారం ఉదయం 10 గంటల వరకు అంటే 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీద చనిపోయిన వారు 81 మంది. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య సుమారు వెయ్యి మంది. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో సెకనుకు ఒకళ్ళు చనిపోతున్నారని చెప్పటంలో ఏమిటర్ధం ?  24 గంటల్లోనే 86,400 మంది చనిపోతే మరి గడచిన 4 మాసాల్లో ఎన్నిలక్షల మంది చనిపోయుండాలి ? ఒక్క ఏపిలోనే రోజుకు 86,400 మంచి చనిపోతుంటే మరి కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో కానీ పరీక్షల నిర్వహణ, క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డుల నిర్వహణలో కేంద్రప్రభుత్వం, హై కోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఎలా మెచ్చుకుంటున్నాయి ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి సీటులో జగన్మోహన్ రెడ్డి కూర్చోవటాన్ని చంద్రబాబు మొదటినుండి తట్టుకోలేకపోతున్నారు. దానికితోడు 151 సీట్ల అఖండ మెజారిటితో జగన్ గెలవటాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతున్నారు. గెలిచిన జగన్ తో పాటు గెలిపించిన జనాలపైన కూడా చంద్రబాబు బాగా అక్కసు పెంచుకున్నారు. అందుకనే జగన్ + జనాలపై మొదట్లో చాలా అక్కసు వెళ్ళగక్కాడు. కాలక్రమేణా జనాలపై అక్కసు తగ్గినా జగన్ విషయంలో మాత్రం అక్కసు పెరిగిపోతోంది. అందుకంటే ఎక్కడ వీలుంటే అక్కడే వీలు దొరకకపోతే వీలు చేసుకుని మరీ విషం చిమ్మేస్తున్నాడు. సెకనుకు ఒకరు చనిపోతున్నారన్న ఆరోపణ కూడా ఇందులో భాగమనే అనుకోవాలి. ఏం చేస్తాం ఎవరి పిచ్చి వాళ్ళకానందమని సరిపెట్టుకోవాలంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: