హెరాల్డ్ సెటైర్ :  చంద్రబాబు మీద వైసిపి ఎంపి అనుమానం ... ఏమిటో తెలుసా ?

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మీద వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి పెద్ద అనుమానమే వచ్చింది. ’చంద్రబాబు అసలు రాయలసీమ బిడ్డేనా... మీరు ఏపి వారేనా’ అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి  ఈ అనుమానం విజయసాయిరెడ్డి ఒక్కడిదేనా ? లేకపోతే మొత్తం రాయలసీమ, ఏపి జనాలందరికీ ఉన్న అనుమానాన్నే ఎంపి చంద్రబాబు ముందుంచాడా ? అన్నది చాలా కీలకం.

ఇంతకీ విషయం ఏమిటంటే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగు నీరందించేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే ఓ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కూడా అనుకున్నది. దీనికి సంబంధించిన జీవో ఈ నెల 5వ తేదీన జారీ అయ్యింది. ఎప్పుడైతే జీవో జారీ అయ్యిందో  వెంటనే కేసీయార్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఏపి ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకెళతానని ప్రకటించాడు. ఇదే సమయంలో ఏపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణాలో పాలక, ప్రతిపక్షాలన్నీ కలిసిపోయాయి.

ఏపి ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణాలో పాలక, ప్రతిపక్షాలు కలిసిపోయినపుడు ఏపిలో మాత్రం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వామపక్షాలు, కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. అంటే పరోక్షంగా కేసీయార్ కే మద్దతుగా ఉన్నట్లు అనుకోవాలి. ప్రతిపక్షాల్లో బిజెపి మాత్రమే జగన్ కు మద్దతుగా నిలబడింది. జగన్ నిర్ణయానికి మిగిలిన ప్రతిపక్షాలు కూడా మద్దతివ్వాలంటూ బిజెపి ఉపాధ్యక్షడు విష్ణు వర్ధన్ రెడ్డి పిలుపిచ్చిన విషయం తెలిసిందే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి చిన్న విషయం మీద నానా రాద్దాంతం చేసే చంద్రబాబు రాయలసీమ, నెల్లూరుకు సాగు, తాగు నీరందించే ప్రాజెక్టు విషయంలో మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు ?  జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అంశం. అయినా  చంద్రబాబు ఇందులో కూడా రాజకీయమే చేస్తున్నాడు. ఎలాగంటే ప్రాజెక్టు నిర్మాణం జరిగితే జగన్ కు మంచిపేరు వస్తుంది. తమకేం వస్తుంది అని ఆలోచిస్తున్నట్లున్నాడు. లేకపోతే ప్రాజెక్టు గొడవలతో కేసీయార్, జగన్ మధ్య సంబంధాలు చెడిపోతే తాను లబ్ది పొందాలని అనుకుంటున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇక్కడే విజయసాయిరెడ్డి ధర్మ సందేహాన్ని లేవనెత్తాడు. రాయలసీమ వాసివే అయితే ప్రాజెక్టుకు మద్దతివ్వాలని ఒకవేళ ఏపి వాడివే అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ కు మద్దతివ్వాలని ఎంపి స్పష్టం చేశాడు. మరి ఎంపి సందేహాన్ని చంద్రబాబు తీరుస్తాడా ? లేకపోతే ఇటువంటి ఎంపిలను చాలామందిని చూశానంటూ దులిపేసుకుని తన రాజకీయాన్ని కంటిన్యు చేస్తాడా ? చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: