ఆ బౌలర్ అంటే నాకు చాలా భయం : వీరేంద్ర సెహ్వాగ్

praveen
వింటుంటే ఆశ్చర్యమేస్తోంది కదూ. లేదంటే బౌలర్లను వీర బాదుడు బాదే బ్యాట్స్‎మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ని ఓ బౌలర్ భయపెట్టడం అంటే కాస్త విడ్డురం గానే ఉంటుంది మరి. ఫార్మెట్ తో సంబంధం లేదు, పిచ్ ఎక్కడైనా, బౌలర్ అంటే లెక్కే లేదు... అక్తర్, బ్రెట్ లీ లాంటి అరవీర భయంకర బౌలర్స్ విసిరిన బంతులను అవలీలగా బౌండరీ దాటించిన ఘనత మన సెహ్వాగ్ దే. ఈ క్రమం లో భారత్‌ సాధించిన ఎన్నో విజయాల్లో అతగాడు కీలక పాత్ర పోషించాడు. అట్లాంటి వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ బౌలర్ అంటే మాత్రం పిచ్చి భయమట.
అవును, అతడు మరెవరో కాదు శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయం గా చెప్పడం ఇపుడు ప్రత్యేకత సంతరించుకుంది. మురళీధరన్ అంటే తనకు భయమని.. పరుగులు తీసేందుకు ఇబ్బంది పడే వాడినని తాజాగా వెల్లడించాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ "నాకు ముత్తయ్య మురళీధరన్ అంటే భయం. అతడు విసిరిన బంతులు ఇబ్బంది పెట్టేవి. అతని బౌలింగ్ లో ఎలా పరుగులు తీయడం నాకు కష్టంగా ఉండేది. మురళీ ధరన్ బౌలింగ్‌ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడే వాడిని." అంటూ చెప్పుకొచ్చాడు.
తన క్రికెట్ జీవితం కాలం లో షేన్ వార్న్, షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌ గ్రాత్‎ లకు కూడా వీరేంద్ర ఎప్పుడూ భయపడ లేదట. ఇకపోతే, ప్రపంచం లో అత్యంత విజయ వంతమైన స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ అనే సంగతి అందరికీ విదితమే. రెండు ఫార్మాట్లలో శ్రీలంకకు తిరుగులేని విజయాలను అందించడం లో కీలక పాత్ర పోషించాడు. 800 టెస్టు వికెట్లు, 534 వన్డే వికెట్లతో ప్రపంచంలోనే నెం.1 బౌలర్‌గా ఉన్నాడు. ఏ ఇతర బౌలర్ కూడా అతని దరిదాపుల్లో కూడా లేకపోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: