ప్రపంచ రికార్డు కొట్టిన.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మట్ కు ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది అంటే అది ఐపీఎల్ కారణంగానే అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లందరూ కూడా ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఐపీఎల్ వల్ల ఇక లాభపడిన క్రికెటర్లు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి. ఐపీఎల్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది బీసీసీఐ.

 ఐపీఎల్ వస్తుంది అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మ్యాచ్ లు వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి ఐపీఎల్ తోనే ఇటీవలే ఒక ప్రపంచ రికార్డును కొల్లగొట్టింది. సాధారణంగా ఐపీఎల్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ వ్యూవర్ షిప్ లో  ప్రతి ఏడాది రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు కూడా ఇలాంటి రికార్డు సృష్టించింది. కానీ ఇది ఇప్పుడు ప్రపంచ రికార్డు కావడం గమనార్హం. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.

 ఈ రెండు జట్ల మధ్య జరిగినా ఫైనల్ మ్యాచ్ సమయంలో జియో సినిమాలో వ్యూయర్ షిప్ విషయంలో మాత్రం ఐపీఎల్ ప్రపంచ రికార్డు సృష్టించింది. జియో సినిమా యాప్ లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ కాగా గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 3.2 కోట్ల మంది ఈ మ్యాచ్ వీక్షించారు. గతంలో ఎప్పుడు కూడా లైవ్ స్ట్రీమ్ సమయంలో ఒక మ్యాచ్ ను యాప్ లో ఇంతమంది చూడలేదట. దీంతో ఈ మ్యాచ్ లో వ్యూవర్ షిఫ్ విషయంలో ఐపీఎల్ ఫైనల్ ప్రపంచ రికార్డు కొట్టింది అని తెలుస్తుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్లో చెన్నై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: