ఐపీఎల్ ఫైనల్.. మ్యాచ్ లేట్ అయితే.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

praveen
ఐపీఎల్ జరిగినన్ని రోజులు ప్రతి మ్యాచ్ పై కటాక్షం చూపించిన వరుణ దేవుడు అటు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై మాత్రం కాస్త కన్నెర్ర చేసాడు. ఎందుకంటే ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు, ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో వర్షం కారణంగా పెద్దగా ఆటంకం జరగలేదు. కానీ ఇప్పుడు కీలకమైన ఫైనల్ మ్యాచ్ సమయంలో మాత్రం వరుణుడు పగబట్టినట్లుగానే వ్యవహరిస్తున్నాడు. ఆదివారం రోజున జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది అన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ నిర్వహించాలని రిఫరీలు ఎంత ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు.

 దీంతో ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఏర్పాటుచేసిన రిసర్వ్ డే అయినా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈరోజు కూడా 60% వర్షం పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇక మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది అని చెప్పాలి. ఒకవేళ మ్యాచ్ ఆలస్యం అయితే అంపైర్లు ఎన్ని ఓవర్లలో మ్యాచ్ నిర్వహిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆ వివరాలను తెలుసుకునేందుకు క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.

 ఒకవేళ వర్షం కారణంగా ఈరోజు జరగబోయే మ్యాచ్ కూడా లేట్ అయ్యి.. 9:45 గంటలకు మ్యాచ్ మొదలైతే 19 ఓవర్లతో మ్యాచ్ నిర్వహిస్తారు. 10 :30 గంటలకు మొదలయితే 15 ఓవర్లతో మ్యాచ్ ఉంటుంది. 11 గంటలకు మొదలైతే 12 ఓవర్లతో.. 11:30 గంటలకు మొదలయితే 9 ఓవర్లతో మ్యాచ్ నిర్వహిస్తారు. 12: 26 గంటలకు మ్యాచ్ మొదలైతే ఐదు ఓవర్లతో మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. ఒకవేళ వర్షం కారణంగా పూర్తిగా మాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇక పాయింట్స్ టేబుల్ లో టేబుల్ టాపర్గా కొనసాగుతున్న టీం నే ఇక ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా  ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో ఏం జరగబోతుంది ఏ జట్టు టైటిల్ విన్నర్ గా నిలవబోతోంది అన్నది మరింత ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: