ఆర్సిబి పట్టించుకోలేదు.. కానీ ముంబై ఇండియన్స్ అండగా నిలిచింది?

praveen
ఇటీవల ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై జట్టును గెలిపించింది ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆకాష్ మద్వాల్ పేరు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అతను తన బౌలింగ్ తో మ్యాజిక్ చేసి చూపించాడు అని చెప్పాలి. కేవలం 3.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అన్ క్యాప్డ్ ప్లేయర్గా ఆకాష్ మద్వాల్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే భారత క్రికెట్లో అతని పేరు ఒక్క సారిగా మారుమోగిపోయింది. ఇంతకీ ఆ ఆకాష్ మద్వాల్ ఎవరు? ఇంతకుముందు ఐపీఎల్ లో ఏ ఏ జట్ల తరఫున ఆడాడు అనే విషయం తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల తన ఐపీఎల్ కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆకాష్ మద్వాల్. తాను 2019లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నెట్ బౌలర్గా చేరాను. అప్పుడు ఎవరి నుంచి తనకు మద్దతు లభించలేదు. ఇక జట్టులో ఆడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు.

 ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కు మారాను. ఇక్కడ నా ప్రతిభను గుర్తించారు. వరుసగా ఛాన్స్ లు ఇచ్చారు అంటూ ఆకాష్ మద్వాల్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తనకు పూర్తిగా మద్దతుగా నిలిచింది అంటూ తెలిపాడు. ఉత్తరాఖండ్ కు చెందిన కుడి చేతివాటం ఫేసర్ ఆకాష్ మద్వాల్ ను బెంగళూరు జట్టు 2021లో కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. 2022లో మళ్ళీ అతని వదిలేసింది. అయితే 2022లో ముంబై ఇండియన్స్ రూపంలో అతనికి అదృష్టం వరించింది. సూర్య కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతనికి ఏ ఎడిషన్ లో అవకాశం ఇవ్వకపోయినప్పటికీ మినీ వేలంలో 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. 2023 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో మొహాలీలో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో మూడు వికెట్లు తీసి 37 పరుగులు ఇచ్చాడు. 7 మ్యాచ్ లలో చాన్స్ దక్కించుకున్న అతను 13 వికెట్లు కూడా పడగోట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: