ప్లే ఆఫ్ మ్యాచ్ లు వర్షంతో రద్దైతే.. ఏం చేస్తారో తెలుసా?
ఇక ఈ మ్యాచ్ లో హోరాహోరీగా జరిగిన పోరులో డిపెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ పై నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి ఫైనలిస్ట్ గా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైనల్ అడుగుపెట్టిన టీం గా కూడా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కొన్ని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఇక ఇప్పుడు కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లు కూడా వర్షం ప్రభావంతో రద్దయితే పరిస్థితి ఏంటి అని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకుల మదిలో ఒక ప్రశ్న మెదిలే ఉంటుంది.
ఇలా కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయితే ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం... వర్షం లేదా మరే ఇతర కారణం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇక విజయాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయిస్తారు. ఒకవేళ మ్యాచ్ లో సూపర్ ఓవర్ కూడా నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోతే.. లీగ్ దశలో ఆయా జట్ల స్థానాన్ని బట్టి మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు. అయితే ప్లే ఆఫ్స్ కోసం ప్రత్యేకంగా రిజర్వుడు డే లేదు. ఫైనల్ మ్యాచ్కు మాత్రం ఇలా రిజర్వ్డ్ డే ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఇక రిజర్వుడ్ డే రోజున మ్యాచ్ ను నిర్వహిస్తారు అని చెప్పాలి.