అప్పుడు ముంబై చేసిన సహాయానికి.. ఇప్పుడు రుణం తీర్చుకున్న ఆర్సిబి?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ అతి కష్టం మీద ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందె. మైనస్ రన్ రేట్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి వచ్చి చివరికి ప్లే ఆఫ్ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక క్వాలిఫైయర్ 2 లో అటు లక్నో జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చేసిన సహాయానికి ఇక ఇప్పుడు రుణం తీర్చుకుంది అంటూ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

 ఇంతకీ ఏమైంది అంటే.. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత దారుణమైన వైఫల్యాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూసి నిజంగా ముంబై టీమేనా ఇలా ఆడుతుంది అని అందరూ షాక్ లో మునిగిపోయారు. అయితే చెత్త ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. అయితే ఇక కీలకమైన సమయంలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ముంబై ఓటమి అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతగానో కలిసి వచ్చింది. ముంబై ఓటమి కారణంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి

 ఇలా గత ఏడాది మే 21వ తేదీన ఢిల్లీ జట్టును ముంబై ఇండియన్స్ ఓడించడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దక్కాయి. అప్పుడు ముంబై ఇండియన్స్ చేసిన సహాయానీకి ఇప్పుడు ఆర్సీబీ రుణం తీర్చుకుంది. ఇటీవలే జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోవడం ద్వారా మైనస్ రన్ రేట్ ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ చివరికి ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకుంది. ఇక ఈ విషయం గురించి చర్చిస్తూ ముంబై చేసిన సహాయానికి ఆర్సీబీ రుణం తీర్చుకుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: