డబ్ల్యూటీసి ఫైనల్ కి ముందు.. ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్?

praveen
మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని రెండు జట్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది డబ్ల్యూటీసి ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా జట్టు చివరి మెట్టు దగ్గర బోల్తా పడింది. దీంతో కేవలం రన్నరఫ్ గా మాత్రమే సరిపెట్టుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం టైటిల్ గెలవడమె లక్ష్యంగా బలిలోకి దిగుతుంది. అయితే ఇక మొదటిసారి డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. ఇక మొదటిసారి టైటిల్ ఎగరేసుకుపోవాలని ఆశపడుతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసి  ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఇటీవల ఐపీఎల్లో గాయపడ్డ ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జాస్ హెజిల్ వుడ్.. డబ్ల్యూటీసి ఫైనల్ కు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. అయితే కేవలం డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కి మాత్రమే కాదు ఆ తర్వాత జరిగే కీలకమైన యాషెష్ సిరీస్ కి కూడా అతను అందుబాటులో ఉంటాడట.

 కాగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లో జరుగుతూ ఉండగా.. జూన్ 16వ తేదీ నుంచి జూలై 31 వరకు ఈ యాషెష్ సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి. కాగా 2023 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించాడు హెజిల్ వుడ్.   మూడు మ్యాచుల్లో 9 ఓవర్లు మాత్రమే వేసాడు. అయితే అతను పూర్తిగా ఫిట్ గా ఉండి ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉండేది. కానీ హెజిల్ వుడ్  గాయం బారిన పడడంతో చివరికి ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు అని చెప్పాలి. ఇలా ఐపీఎల్లో గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో  డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరం అవుతాడని ఆ దేశ అభిమానులు కంగారు పడినప్పటికీ ప్రస్తుతం అతను కోలుకున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: