ఎలాంటి ఫార్ములా లేదు.. గెలుపుపై ధోని ఏమన్నాడంటే?

praveen
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం కేవలం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతూ ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఐపీఎల్ ద్వారా తన ఆటతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పోనీలే ధోని ఆటను ఐపీఎల్లో అయినా చూడగలుగుతున్నామని ఫ్యాన్స్ సంతృప్తి చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ధోని కి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ కూడా 2023 ఐపీఎల్ సీజన్ ఎంతో ప్రత్యేకమైన సీజన్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే చెన్నై జట్టు ఆట తీరును పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగిన కూడా వదలకుండా ఇక భారీగా ఖర్చు పెట్టుకుని మరి ఇండియాలోని అన్ని ఐపిఎల్ వేదికలకు తిరుగుతూ చెన్నైకి మద్దతు తెలుపుతున్నారు సిఎస్కే ఫ్యాన్స్. ఇక ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా అటు చెన్నై అభిమానులందరూ భారీగా అరుణ్ జైట్లీ స్టేడియం కు తరలివచ్చారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్ లో అటు ఢిల్లీ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ విజయం ద్వారా అటు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన రెండో జట్టుగా కూడా రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

 అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇక హోం గ్రౌండ్లో ఢిల్లీ జట్టును ఓడించడంపై స్పందించిన మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ జట్టు పై గెలిచి ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశాడు ధోని. విజయానికి ఫార్ములా ఏమీ లేదు. బెస్ట్ ప్లేయర్లను ఎంచుకొని వారు ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలి. వారిలోని లోపాలను సరిదిద్దాలి.. జట్టు కోసం ఏ స్థానాన్ని అయినా త్యాగం చేయగలగాలి అంటూ ధోని చెప్పుకొచ్చాడు. టీం విజయానికి మేనేజ్మెంట్ ప్లేయర్లు కారణమని ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అండగా నిలబడ్డారని ధోని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: