ఐపీఎల్ : కోహ్లీని వెనక్కి నెట్టి.. వార్నర్ అరుదైన రికార్డ్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ల లిస్ట్ తీస్తే అందులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరే ముందుగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏకంగా భారత క్రికెటర్లకు కూడా ఐపీఎల్ లో సాధ్యం కానీ ఎన్నో రికార్డులను అటు విదేశీ క్రికెటర్ అయ్యుండి వార్నర్ సాధించాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఎంతోమంది విదేశీ ప్లేయర్లు ఆడిన ఇక ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తన పేరున లికించుకున్నాడు డేవిడ్ వార్నర్.

 ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా అత్యుత్తమమైన ప్రతిభ కనబరుస్తూ ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల లిస్టులో ముందు వరుసలోనే కనిపిస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. అయితే గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన సమయంలో ఇలాంటి అద్భుతమైన ఈ ఇన్నింగ్స్ లతోనే ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున కూడా అదే రీతిలో బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నాడు డేవిడ్ వార్నర్.

 భారత స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీకి సైతం సాధ్యం కానీ రికార్డును అటు డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 500 ప్లేస్ స్కోర్ చేసిన ఆటగాడికి నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఏకంగా ఏడుసార్లు వార్నర్ 500 ప్లస్ స్కోర్ చేశాడు. అయితే ఇక వార్నర్ తర్వాత స్థానంలో ఆరుసార్లు 500 ప్లస్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా కోహ్లీ ఉన్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, లక్నో కెప్టెన్ కే ఎల్ రాహుల్ కూడా ఐపిఎల్ లో ఐదు సార్లు 500 ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ 500 ప్లస్ స్కోర్ చేసిన ఎక్కువ బంతులను తినేశాడు అనే విమర్శ ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: