ధోనికి లైఫ్ టైం గుర్తుండే.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్?

praveen
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి.. ఇక 2023 ఐపీఎల్ సీజన్ చివరి ఐపిఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ధోని ఆటను వీక్షించేందుకు అభిమానులు ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు కేవలం హోం గ్రౌండ్లో సీఎస్కే మ్యాచ్ ఆడినప్పుడు మాత్రమే ఎక్కువగా అభిమానులు స్టేడియం కు వచ్చి మ్యాచ్ వీక్షించేవారు. కానీ ఇప్పుడు చెన్నై జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడుతున్న.. అక్కడ ఇక హోం గ్రౌండ్ టీం ఫ్యాన్స్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్సీ ఎక్కువగా కనిపిస్తున్నారు.

 మైదానం మొత్తం కూడా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ అనంతరం ధోని మైదానం మొత్తం తిరుగుతూ అటు అభిమానులకు అభివాదం చేయడంతో ఇక ఈ ఏడాది ఐపీఎల్ ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే చెపాక్ స్టేడియం తో అటు ధోనీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా చపాక్ స్టేడియం చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ గా కొనసాగుతుంది. ధోని టీం కి ఇక్కడ అభిమానుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తూ ఉంటుంది. దీంతో ఒక ఇంటర్వ్యూలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో ఆడాలనుకుంటున్నాను అంటూ గతంలో ధోని చెప్పిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

 ఇదిలా ఉంటే అటు ఇటీవలే మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఏకంగా ధోనికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది చూసి ధోని కూడా ఆశ్చర్యపోయాడు అని చెప్పాలి. నిజంగా చెప్పాక్ స్టేడియం రూపంతో ఉన్న ఒక చిన్న ఫోటోని బహుమతిగా ఇచ్చారు అభిమానులు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ధోనితో పాటు ఆ అభిమాని కలిసి ఉన్న ఫోటో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎంఏ చిదంబరం అంటే చపాక్ స్టేడియం నమూనాని ధోనీకి బహుమతిగా అందించారు అభిమానులు. ఈ వీడియో చూసి ఇక ధోని సైతం సంతోషంలో మునిగిపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: