కారు పై స్టంట్స్ చేస్తున్న శుబ్ మన్ గిల్.. ఆట ఒక్కటే కాదు స్పైడర్ మ్యాన్ గా కూడా !

praveen
శుబ్ మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాడిగా పేరు దక్కించుకుంటున్నాడు. తనకు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేదు. ఆటతో అబ్బాయిల మనసు దోచుకుంటే, తన అందమైన లుక్స్ తో అమ్మాయిల మనసులను  గిలిగింతలు పెడుతున్నాడు. శుబ్ మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ ఆటగాడిగా కొనసాగుతూనే ఇండియన్ క్రికెటర్ గా కూడా అనేక మ్యాచ్ లు ఆడాడు. ఇక ఐపీఎల్ తర్వాత మంచి క్రేజ్ సాధించుకున్న c ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే అదేదో హిందీ సినిమా అనుకుంటే పొరపాటే ఏకంగా హాలీవుడ్ చిత్రం కోసం తన వాయిస్ డబ్బింగ్  చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. ఆ చిత్రం పేరు స్పైడర్ మాన్ అక్రాస్ ది స్పైడర్ వెర్స్.

ఇది ఒక యానిమేషన్ చిత్రం. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను సోని పిక్చర్ ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత భారీ హంగులతో ఇండియాలో విడుదల చేయబోతున్నారు. ఇది ఇండియాలోని అనేక భాషల్లో విడుదలవుతుండడం విశేషం. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, పంజాబీ, మరాఠీ, గుజరాతి, బెంగాలీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో అత్యంత అట్టహాసంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శుబ్ మన్ గిల్ స్పైడర్ మాన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తూ ఉండడం విశేషం.

 ఇక శుబ్ తన గొంతును హిందీ మరియు పంజాబీ భాషల కోసం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది. జూన్ మొదటి తారీకున ప్రేక్షకుల ముందు వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శుబ్ మన్ గిల్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. అంతే కాదు రోడ్డు మీద ఉన్న కారు ఎక్కి తానే స్పైడర్ మాన్ లా ఫోజులిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇటీవల సల్మాన్ ఖాన్ సైతం ఒక హాలీవుడ్ సినిమా కోసం ప్రమోషన్స్ చేయగా అతడి బాటలోనే  శుబ్ మన్ గిల్ కూడా స్పైడర్ మాన్ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: