కోహ్లీ స్టోరీ పెడితే.. ఆ ప్లేయర్ పని అంతేనా?

praveen
విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అద్భుతం ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టన్నుల కొద్దీ పరుగులు చేసి ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. అయితే ఇక ఎంత మంచి ప్రదర్శనలు చేస్తున్న అటు విరాట్ కోహ్లీకి బాడ్ లక్కీ కూడా మంచి స్నేహితుడిగా కొనసాగుతున్నాడు. ఎందుకంటే అతను కెప్టెన్సీ వహించిన సమయంలో అటు భారత జట్టుకు వరల్డ్ కప్.. ఇటు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఒక్కసారి టైటిల్ అందించిన దాఖలాలు లేవు. దీంతో అతని కెప్టెన్సీ పై విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే విరాట్ కోహ్లీ తన వెంట ఉన్న బ్యాడ్ లక్ని ఇక ఇప్పుడు మిగతా ఆటగాళ్లకు కూడా అంటిస్తున్నాడ అంటే మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూసి అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై కోహ్లీ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పెడుతూ ఇక ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ ఉన్నాడు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏముందంటే... కోహ్లీ ఇలా ఇంస్టాగ్రామ్  స్టోరీలో ప్రస్తావించిన ప్రతి ఆటగాడు తర్వాత మ్యాచ్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 లక్నోతో మ్యాచ్లో గుజరాత్ వికెట్ కీపర్  సాహా 43 బంతుల్లో 81 పరుగులు చేయగా.. కోహ్లీ.. వాటే ప్లేయర్ అంటూ ఇన్స్టార్లో స్టోరీ పెట్టాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లో రెండు పరుగులకే సాహ అవుట్ అయ్యాడు. ఇక ఆరెంజ్ క్యాప్ రేస్  లో నిలిచిన యశస్వి జైష్వాల్  నీ పొగుడుతూ వాటే టాలెంట్ అంటూ స్టోరీ పెట్టాడు. యశస్వి జైస్వాల్ ఆర్సిబి తో మ్యాచ్లో డక్ అవుట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ పై సెంచరీ బాదిన సూర్యకుమార్ను పొగుడుతూ మరాఠీలో హాట్సాఫ్ యు బ్రదర్ అంటూ స్టోరీ పెట్టాడు. తర్వాత మ్యాచ్ లో  సూర్య ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గిల్ ఇటీవల సెంచరీ చేయడంతో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చెలరేగిపోతాడు అంటూ స్టోరీ పెట్టగా.. తర్వాత ఆర్సిబి తో మ్యాచ్లో గిల్ ప్రదర్శన ఎలా ఉంటుంది అని దానిపైన అందరూ దృష్టి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: