అదంతా అబద్ధం.. నేను ధోని తొలి వికెట్ కాదు : పీటర్సన్

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. ఇక ధోని కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా ధోనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతూ ఉండటం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సైతం ధోనితో ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నో పోస్టులు పెడుతున్నారు.

 ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని తన బౌలింగ్లో తీసిన మొదటి వికెట్ తనది కాదు అంటూ ఇటీవలే ఒక ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. అదే సమయంలో 2017 ఐపిఎల్ సీజన్ సమయంలో ధోనికి తనకు మధ్య సరదా ఫైట్ జరిగింది అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. 2017లో ధోని రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ టీం లో ఆడుతున్నాడు. ఆ సమయంలో మైక్ పట్టుకుని ఫీల్డింగ్  చేస్తున్న మనోజ్ తివారితో ధోని కంటే నేను మంచి గోల్ఫర్ అని పీటర్సన్ అన్నాడు. దీంతో ధోని రిప్లై ఇస్తూ నువ్వే నా తొలి వికెట్ అని అదే మైక్ ద్వారా  పీటర్సన్ కి సమాధానం ఇచ్చాడు. కానీ ఆరోజు డిఆర్ఎస్తో నిర్ణయాన్ని ఎంపైర్ వెనక్కి తీసుకున్నట్లు పీటర్సన్ గుర్తు చేశాడు.

 అయితే ఇక ఇటీవలే ఇలా ధోని తొలి వికెట్ తనది కాదు అన్న విషయానికి వీడియో దొరకడంతో కెవిన్ పీటర్సన్ వెంటనే ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 2011 లో ఇంగ్లాండ్ లో పర్యటించిన టీమిండియా ఆ టూర్ లో ఒక మ్యాచ్ లో ధోని బౌలింగ్ చేశాడు. ధోని వేసిన బంతి పీటర్సన్ ను దాటుకుని వికెట్ కీపర్ ద్రవిడ్ చేతుల్లో పడింది. అందరూ అప్పీల్ చేయడంతో అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కానీ పీటర్సన్ రివ్యూ తీసుకోవడంతో బంతి ప్యాడ్ కు తగలేదని తెలిసింది. దీంతో ఎంపైర్ తన  నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ వీడియోని పీటర్సన్ పోస్ట్ చేస్తూ. స్పష్టమైన సాక్ష్యం ఉంది.. అదంతా ఫేక్.. నేను ధోని తొలి వికెట్ కాదు ధోని నుంచి మాత్రం అది మంచి బంతి అంటూ క్యాప్షన్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: