IPL 2023: గిల్ ఖాతాలో రేర్ రికార్డ్?

Purushottham Vinay
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ టీం తరపున శుభ్‌మాన్ గిల్ ఆడుతున్నాడు. టోర్నీలో మే 15 వ తేదీన హైదరాబాద్‌ టీంతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు.ఇంకా ఈ సెంచరీతో గిల్ తన పేరిట చాలా ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో అలా చేసిన ఫస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్ ఈ సంవత్సరం (2023) అంతర్జాతీయ, ఐపీఎల్‌తో కలిపి మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు.నరేంద్ర మోదీ స్టేడియంలో హైదరాబాద్‌ టీంతో జరిగిన మ్యాచ్‌లో అతను 58 బంతుల్లో 13 ఫోర్లు ఇంకా 1 సిక్స్ సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఏకంగా మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఫస్ట్ క్రికెటర్‌గా  గిల్ నిలిచాడు.జనవరి 15 వ తేదీన శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గిల్ 2023లో ఫస్ట్ సెంచరీ సాధించాడు.మొత్తం 97 బంతుల్లో 116 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే జనవరి 18న, అతను న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.


ఇక ఆ తర్వాత జనవరి 24న న్యూజిలాండ్‌పై గిల్ మరో సెంచరీ సాధించాడు.ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌ టీంతో ఆడిన t20 సిరీస్‌లో, గిల్ తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీని (1 ఫిబ్రవరి) సాధించాడు. అతను 200 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేస్తూ కేవలం 63 బంతుల్లో 126* పరుగుల ఇన్నింగ్స్ ని ఆడాడు.అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 ఫోర్లు ఇంకా 7 సిక్సర్లు ఉన్నాయి.ఇంకా అదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా టీంతో ఆడిన చివరి మ్యాచ్‌లో, అతను ఏకంగా 128 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది . ఈ విధంగా గిల్ 2023 వ సంవత్సరంలో ఐపీఎల్‌తో సహా మొత్తం 4 ఫార్మాట్లలో గిల్ సెంచరీ సాధించాడు.గిల్ కూడా ఖచ్చితంగా కోహ్లీ, ధోని, సచిన్, సెహ్వాగ్ లాగా క్రికెట్ లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపుని తెచ్చుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి మున్ముందు గిల్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: