బ్యాటింగ్లో విఫలమైనా.. రోహిత్ అరుదైన రికార్డ్?

praveen
రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక భారత జట్టు తరుపున కూడా స్టార్ ఒపెనర్ గా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఐపీఎల్ హిస్టరీలో సైతం ఇక రోహిత్ రికార్డులు చూసుకుంటే.. అత్యుత్తమ ప్లేయర్ల లిస్టులో అతను మొదటి వరుసలోనే ఉన్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటివరకు జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కూడా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం రోహిత్ ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతున్నాడు.

 పరుగులు చేయడానికి రోహిత్ శర్మ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అతనికి మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ కు వస్తున్న రోహిత్ శర్మ తక్కువ పరుగులు చేసి వికెట్ కోల్పోతున్నాడు. కొన్ని కొన్ని మ్యాచ్లలో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ అయిన పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం రోహిత్ శర్మ పెద్దగా బ్యాటింగ్లో ఆకట్టుకోకపోయినప్పటికీ.. అటు ఒక అరుదైన రికార్డును మాత్రం సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ ప్లేయర్గా అవతరించాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో 252 సిక్సర్లు కొట్టాడు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో క్రిస్ గేల్ 357 సిక్సర్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత 251 సిక్సర్లతో మూడో ప్లేస్ లో ఉన్నాడు ఎబి డివిలియర్స్. అంతేకాకుండా ఇక ముంబై ఇండియన్స్ జట్టు తరఫున 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇటీవల గుజరాత్ తో మ్యాచ్లో సిక్సర్ కొట్టడం ద్వారా ఈ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: