స్లో ఓవర్ రేట్ కారణంతో.. బిసిసిఐకి ఆదాయం తెలిస్తే షాకే?

praveen
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేక్షకులకు ఊహించిన దాని కంటే ఎక్కువ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. దీనికి కారణం ప్రతి మ్యాచ్ లో కూడా విజేత ఎవరు అన్న విషయాన్ని ముందుగా ప్రేక్షకులు ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు హోం గ్రౌండ్లో ఆడిన జట్టు తప్పకుండా విజేతగా నిలుస్తుంది అని నమ్మేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లోమ్యాచ్ ఆడుతున్న టీమ్స్ కూడా ఓడిపోతూ ఉండడం కూడా ఐపీఎల్ లో కనిపిస్తుంది. దీంతో ఎవరు గెలుస్తారు అనే అంచనాకు ముందుగా రాలేకపోతున్నారు ప్రేక్షకులు.

 ఇక ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ సాగుతుంది. ఇలా చివరి బంతికి ఫలితం తేలుతూ ఉండడంతో ప్రేక్షకులు కన్నార్పకుండా మ్యాచ్  చూస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్లో చివరి దశకు చేరుకున్నాయ్. ఇక మరికొన్ని రోజుల్లో అటు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టబోయే నాలుగు టీమ్స్ ఏవి అన్న విషయంపై ఒక క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అటు స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వహకులు వేస్తున్న జరిమానాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు కూడా ప్లేయర్స్ కి జరిమానా విధిస్తున్నారు.

 అయితే ఇప్పటివరకు స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా ఆయా టీమ్స్ నుంచి బీసీసీఐ వసూలు చేసిన మొత్తం ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఏకంగా 1.10 కోట్ల రూపాయల జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా వసూలు చేసింది. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్, డూప్లెసెస్, విరాట్ కోహ్లీ, నితీష్ రాణాలు ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో జరిమానాలు కట్టారు. ఇది తెలిసి జరిమానాలను విధించడం లో కూడా బీసీసీఐ లాభం పొందుతుందే అని కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: