ధోని గురించి ఒక్కమాటలో చెప్పమంటే.. ఢిల్లీ ప్లేయర్స్ ఏమన్నారంటే?

praveen
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా ఎంత ద్వితీయమైన విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను అందించిన ఘనత ధోనికే దక్కుతుంది. కేవలం ఒక్క వరల్డ్ కప్  లో మాత్రమే కాదు రెండు వరల్డ్ కప్ లు ఒక ఐసీసీ ట్రోఫీ కూడా అందించి ఇలా మూడు ఫార్మాట్లలో కూడా ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ కూడా ఈ రికార్డును ఏ కెప్టెన్ బ్రేక్ చేయలేకపోయాడు అని చెప్పాలి. ఇలా టీమిండియా క్రికెట్ హిస్టరీలో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ధోనీకి రికార్డులు ఉన్నాయి.

 కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సైతం తాను కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ జట్టుగా నిలిపాడు. ఏకంగా నాలుగు సార్లు టైటిల్ అందించిన నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇలా భారత క్రికెట్లో గొప్ప క్రికెటర్ గా ఎదిగిన ధోని ఎంతోమంది యువ ఆటగాళ్ళకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధోని ఆటను చూసేందుకు దూరాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు స్టేడియం కి తరలి వస్తూ ఉంటారు. ఇక ఎంతోమంది అభిమానులు ధోనిని మిస్టర్ కూల్ తలైవా అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి

 అయితే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తన కెప్టెన్సీ వ్యూహాలతో ఘనవిజయాన్ని అందుకుంది. ఇకపోతే మ్యాచ్ కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ధోని గురించి ఒక్క మాటలో చెప్పాలంటు ప్రశ్నించగా.. అందరూ ఒకే సమాధానం చెప్పారు. ఈ వీడియోని ఢిల్లీకి క్యాపిటల్స్ ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఎక్కువ మంది ప్లేయర్లు ధోనిని లెజెండ్ అంటూ అభివర్ణించడం గమనార్హం. మరి ధోని గురించి ఎవరు ఏం చెప్పారంటే   ఇషాంత్ శర్మ - బిగ్ బ్రదర్, మిచెల్ మార్ష్ - లెజెండ్, అక్షర్ పటేల్ - కెప్టెన్ కూల్, ప్రియమ్ గార్గ్ - మాటలు లేవు, చేతన్ సకారియా - తలైవా, ఖలీల్ అహ్మద్ - లెజెండ్, సర్ఫరాజ్ ఖాన్ -పెద్ద అభిమాని, విక్కీ ఓస్త్వాల్ - కెప్టెన్, అమన్ ఖాన్ - దేవుడు, రిపాల్ పటేల్ - ఫినిషర్, ముఖేష్ కుమార్ - మాటలు లేవు, యష్ ధుల్ - లెజెండ్, ప్రవీణ్ దూబే - లెజెండ్ అంటూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: