గాయంపై.. కేఎల్ రాహుల్ ఎమోషనల్ పోస్ట్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ఎప్పటిలాగానే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇక ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక అంతా బాగానే ఉంది కానీ ఇక ఐపీఎల్ లో అడుగుపెడుతున్న అన్ని జట్లకు మాత్రం ఈ ఏడాది ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి జట్టులోకి తీసుకున్న కీలకమైన ఆటగాళ్ళు గాయం బారిన పడి చివరికి జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కేవలం కొన్ని మ్యాచ్లకు దూరం అవుతుంటే మరి కొంతమంది టోర్నీ మొత్తానికి దూరం అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 అయితే మొన్నటి వరకు కేవలం జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు మాత్రమే దూరమయ్యారు. కానీ ఇటీవల లక్నో జట్టుకు అంతకు మించిన ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ సక్సెస్ఫుల్గా టీం ని ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ కే ఎల్ రాహుల్ ఇటీవల గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో కృనాల పాండ్య తాతకాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఇక కేఎల్ రాహుల్ కోలుకుని మళ్ళీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఐపీఎల్ టోర్నికి మొత్తం దూరమయ్యాడు కేఎల్ రాహుల్.

 అయితే ఐపీఎల్ కు మాత్రమే కాదు అటు డబ్ల్యూటీసి ఫైనల్ కి కూడా దూరమయ్యాడు అని చెప్పాలి. అయితే ఇలా గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడం పై స్పందించిన కేఎల్ రాహుల్  ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అతి త్వరగా కోలుకోవడం పై నేను దృష్టి పెడుతున్నాను. జట్టు కెప్టెన్ గా కీలక సమయంలో అక్కడ లేకపోవడం నాకు బాధ కలిగించింది. కానీ నా టీం సభ్యులు ఎప్పటిలాగానే అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని నమ్మకం ఉంది. డబ్ల్యూటీసి ఫైనల్ కు అందుబాటులో ఉండను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: