ఐపీఎల్ : తొలి ఓవర్ లో కింగ్.. మన భువినే?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్లో అటు బ్యాట్స్మెన్ లదే ఎక్కువగా హవా కొనసాగుతూ ఉంటుంది అని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇక క్రీజు లోకి రావడం రావడమే.. సిక్సర్లు పోర్లతో చలరేగిపోతూ ఉంటారు. దీంతో ఇక టి20 ఫార్మాట్ లో అటు బ్యాట్స్మెన్ లకు బౌలింగ్ చేయడం బౌలర్లకు కూడా కత్తి మీద సాము లాంటిది అని చెప్పాలి.

 ముఖ్యంగా పవర్ ప్లే లో బౌలింగ్ చేయడం అంటే అది మరింత కష్టమైన పని. ఎందుకంటే అందరూ ఫీల్డర్లు కూడా 30 యార్డ్స్ సర్కిల్ లోపలే ఉంటారు. కేవలం ఇద్దరూ లేరా ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే బయట ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అటు బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చల్లరేగిపోతూ ఉంటారు. ఎక్కడ అయితే ఫీల్డర్లు లేరో అటువైపు బంతిని బాదుతూ ఇక సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే పవర్ ప్లే లో బౌలింగ్ చేసే బౌలర్ అటు పరుగులను కట్టడి చేయటమే చాలా కష్టం. అలాంటిది వికెట్లు పడగొట్టడం అంటే అది ఇంకా ఒక సవాలు లాంటిదే అని చెప్పాలి. అయితే ఇక్కడ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం పవర్ ప్లే లో వికెట్లు పడగొట్టడంలో రికార్డు సృష్టించాడు.

 ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో భాగంగా అటు ఢిల్లీ ఇన్నింగ్ సమయంలో తన తొలి ఓవర్ లోనే సాల్ట్ ను అవుట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. అయితే అతని అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ ఓవర్ లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భువనేశ్వర్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ లోనే 23 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఇక భువనేశ్వర్ తర్వాత రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ 21 వికెట్లతో తర్వాత స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: