ఐపీఎల్ లో సందడి చేయబోతున్న.. అన్ సోల్డ్ ప్లేయర్ స్మిత్?

praveen
ప్రస్తుతం భారత్ లో ఐపీఎల్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ ను చూసేందుకు కేవలం ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. దీంతో అన్ని జట్లు కూడా హోరాహోరీగా తలబడేందుకు ఇక అన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి. కాగా ఐపీఎల్ లో ఆడాలనుకున్న ఎంతోమంది ప్లేయర్లు గత ఏడాది జరిగిన మినీ వేలంలో పాల్గొని ఇక ఐపీఎల్ లో ఆయా జట్లలో భాగం అయ్యారు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే కొంతమంది సీనియర్ స్టార్ ప్లేయర్లు మాత్రం ఇక గతంలో జరిగిన మెగా వేలంలో ఇక గత ఏడాది చివర్లో జరిగిన మినీ వేలంలో కూడా అమ్ముడుపోని ఆటగాళ్లు గానే మిగిలిపోయారు. ఇక అలాంటి వారిలో అటు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు ఐపీఎల్ లో పలు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి మంచి ప్రదర్శన చేశాడు. పూణే జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ స్టార్ ప్లేయర్ అండ్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. అయితే స్మిత్ ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోయినప్పటికీ అతను ఐపీఎల్ లో సందడి చేయబోతున్నాడు.

 అదేంటి అన్ సోల్డ్ ప్లేయర్ ఐపిఎల్ లో ఎలా సందడి చేయబోతున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే ఆటగాడిగా కాదు ఏకంగా కామెంటేటర్ గా అవతారం ఎత్తబోతున్నాడు స్మిత్. నమస్తే నేను ఈ ఐపీఎల్లో జాయిన్ అవుతున్నా అంటూ ఇటీవలే ఒక వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేసాడు స్టీవ్ స్మిత్. దీంతో స్టార్ క్రికెటర్ స్మిత్ కాస్త కామెంటెటర్ అవతారం ఎత్తబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా కనీస ధర రెండు కోట్ల రూపాయలతో అతను వేలల్లో పాల్గొంటే ఏ ఫ్రాంచైజీ  ఈ సీనియర్ స్టార్ ప్లేయర్ ను కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: