యోయో టెస్ట్ పై.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్?

frame యోయో టెస్ట్ పై.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లను మాత్రమే తుది జట్టులోకి తీసుకునేందుకు ఇక ఎన్నో కొత్త రూల్స్ తెరమీదకి తీసుకువస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక భారత జట్టులో చోటు దక్కించుకోవాలనుకునే ప్లేయర్లకు యోయో టెస్ట్ ప్రామాణికంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయిన వాళ్లే జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

 ఇక ఈ యోయో టెస్ట్ కారణంగా ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కడం  లేదు అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. యోయో టెస్టులో విఫలం అయితే ఇక ఆ ఆటగాడు క్రికెట్ కి పనికిరానట్లేనా అని ఇప్పటికే బీసీసీఐ తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. ఆటగాడిలో ప్రతిభ ఉండాలి కానీ తప్పనిసరిగా యోయో టెస్ట్ పాస్ కావలసిన అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా గతంలో చూసాం. ఇక ఇటీవల భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే రీతిలో స్పందించాడు.

 భారత ప్లేయర్లకు యోయో టెస్టులతో పాటు ఇక ఎముకల దృఢత్వాన్ని తెలియజేసే డెక్సా టెస్టులను తప్పనిసరి చేయడంపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుర్తించాడు. ఒకవేళ తాను ఆడే సమయంలో యోయో టెస్ట్ గనక ఉండి ఉంటే దిగ్గజ ఆటగాళ్లు టీమిండియా కు దూరం అయ్యేవాళ్ళు అంటూ పేర్కొన్నాడు. ప్లేయర్లు స్కిల్స్ మెరుగుపరచుకోవడం పై దృష్టి పెట్టాలి. కానీ జిమ్ లో కసరతులు చేయడంపై కాదు అంటూ వ్యాఖ్యానించాడు. శరీరం సహకరిస్తేనే జిమ్ చేయాలని లేదంటే.. జిమ్ లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయం బారిన పడే అవకాశం ఉంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: