క్రికెట్ ఆడుతూ.. కిందపడ్డాడు.. చివరికి?

praveen
ఇప్పటికే ఎన్నో రకాల వైరస్ లు ముంచుకొస్తూ మనిషి ప్రాణాలు తీయడానికి పంజా విసురుతూనే ఉన్నాయ్. ఇలాంటి సమయం లో అటు చిన్న చిన్న బాధలకే అక్కడితో జీవితం అయి పోయింది అని భావిస్తూ ఎంతోమంది బలవంతం గా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక మరో వైపు రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా పోతున్న ప్రాణాలు సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది అని చెప్పాలి. ఇవన్నీ చాలవు అన్నట్లు అటు సడెన్ హార్ట్ ఎటాక్ లు ఎంతో  మంది ప్రాణాలను చూస్తూ చూస్తుండగానే తీసేస్తున్నాయి.

 అయితే కేవలం ఆరోగ్యం గురించి పట్టింపు లేనివారికి.. లేదా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇలాంటి సడన్ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఎప్పుడూ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునే వారి దగ్గర నుంచి ప్రతిరోజు వ్యాయామం చేసి ఫిట్ గా ఉండే వారి వరకు అందరిని సడన్ హార్ట్ ఎటాక్ లు కబలిస్తున్నాయి అని చెప్పాలి. వెరసి మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది అని చెప్పాలి. ఇక ఇలా చూస్తూ చూస్తుండ గానే ప్రాణాలు కోల్పోతున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ కూడా భయం భయంగానే రోజు గడిపేస్తున్నారు.

 ఇక ఇటీవల జగిత్యాల జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. 34 ఏళ్ళ యువకుడు  గుండెపోటుతో మరణించాడు అని చెప్పాలి. మల్లాపూర్ మండలం గొర్రెపల్లికి చెందిన కొంపల్లి రాజ విష్ణు స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అయితే ఇలా ఆడుతూ ఆడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతన్ని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజ విష్ణు మరణించినట్లు ధృవీకరించారు. కాగా అతనికి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: