స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్యూర్ కు మేజర్ రీజన్ అదేనా ?

VAMSI
ఇండియా క్రికెట్ టీం లో ఆడే అవకాశం వచ్చిన తర్వాత అతి తక్కువ టైం లో కీలక సభ్యుడిగా మారిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఒకరు సూర్యకుమార్ యాదవ్. వైట్ బాల్ ఫార్మాట్ లో బౌలర్ల పాలిట శాపంగా మారాడు సూర్య. ఇటీవల టెస్ట్ లలో ఆడే అవకాశం వచ్చినా ఇంకా గుర్తింపు తగిన ఇన్నింగ్స్ ఆడకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియాతో 3 వన్ డే ల సిరీస్ ను ఆడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే ముంబై వేదికగా మొదటి వన్ డే జరుగగా... ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 188 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
ఈ స్కోర్ ను చేధించడానికి కూడా ఇండియా ఆటగాళ్లకు 40 ఓవర్లు వరకు సమయం తీసుకోవడమే కాకుండా, అయిదు వికెట్లు కోల్పోవడం విశేషం. కానీ కీలక సమయంలో కె ఎల్ రాహుల్ మరియు జడేజాలు కనుక నెమ్మదిగా ఆడకుంటే ఇండియా ఖచ్చితంగా ఓటమి పాలయ్యేది. ఇక మన సూర్యకుమార్ యాదవ్ రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చాడు. కానీ ఎటువంటి సంయమనం లేకుండా ఎదుర్కొన్న మొదటి బంతికే స్టార్క్ వేసిన మొదటి బంతికే ఎల్బీడబ్ల్యు గా అవుట్ అయ్యాడు. ఇప్పుడే టీం లో చాలా పోటీ ఉన్న నేపథ్యంలో ఈ విధమైన ఆటతీరు వలన ఇండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో ఎలాగోలా అయిదు వికెట్ల తేడాతో ఇండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ పైన ఈ ఫెయిల్యూర్ పై విమర్శలు చేశారు. కానీ అది మరువక ముందే మళ్ళీ విశాఖపట్నం లో ఆదివారం జరిగిన రెండవ వన్ డే లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సమిష్టిగా విఫలం కావడంతో కేవలం
117 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లోనూ సెకండ్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్ లో లాగే స్టార్క్ బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. దీనితో వరుసగా రెండు మ్యాచ్ లలోనూ డక్ అవుట్ అవడంతో తనపై విమర్శలు చుట్టుముట్టాయి. అయితే సూర్య ఫెయిల్ అవ్వడానికి కారణం దూకుడుగా ఆడాలన్న తపనే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. క్రీజులోకి వచ్చిన తర్వాత కొన్ని బంతులు ఆవేశపడకుండా ఆడితేనే సూర్య టీం కు కీలకంగా మారతాడు. మరి చూద్దాం రేపు మ్యాచ్ లో ఏ విధంగా ఆడుతాడు అన్నది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: