ఆసియా కప్ పాక్ లో కుదరకపోతే.. అక్కడ నిర్వహించండి : అక్తర్

praveen
ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ల గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న రెండు దేశాలలో ఈ రెండు మెగాటోర్నీలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరుగుతుండగా భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇక ఈ రెండు దేశాలపై క్రికెట్ సంబంధాలపై నిషేధం ఉంది. దీంతో ఇక దీని పైన గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. అయితే పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము టోర్ని నుంచి తప్పుకుంటాము అంటూ కరాకండిగా ఇప్పటికే చెప్పేసింది బీసీసీఐ.

 అయితే ఒకవేళ బిసిసిఐ అలా చేస్తే తాము కూడా భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటాము అని అటు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు చెబుతున్నప్పటికీ అంత ధైర్యం చేసే ప్రతి శక్తి లేదు అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే విషయంపై ఎంతో మంది పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఒకవేళ భారత్ పాకిస్తాన్ జట్లు లేకుండా ఏ టోర్నీ జరిగిన కూడా ప్రేక్షకాదరణ  పూర్తిగా పడిపోవడం గమనార్హం. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.


 ఆసియా కప్ 2023 టోర్నమెంట్ పాకిస్థాన్లో జరగాలని నేను కోరుకుంటాను. కానీ అలా కుదరకపోతే కనీసం శ్రీలంకలో అయిన టోర్నీ నిర్వహించాలి అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లను చూడాలి. ప్రపంచ క్రికెట్లో దాయదులుగా కొనసాగుతున్న జట్ల మధ్య జరిగే ఫైనల్కు మించిన మ్యాచ్ ఇంకేం ఉండదు అంటూ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి నెలలో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ రెండో దఫా సమావేశాల్లో ఆసియా కప్ వేదిక గురించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. అయితే ఒక్క భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యూఏఈ లో నిర్వహిస్తారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: