బుమ్రా లేకపోతే ఏంటి.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కోసం సమయం ఆసన్నమవుతుంది. మార్చ్ 31వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు అందరూ కూడా ఐపీఎల్ సీజన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నారు. అదే సమయం లో అన్ని జట్లు కూడా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇక ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కి వరుసగా షాక్ లు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక మరోవైపు ఆల్రౌండర్ జై రిచర్డ్ సన్  కూడా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా అనుమానంగానే మారిపోయింది. ఇకపోతే ఇలా ముంబై ఇండియన్స్ ను గాయాలు బెడద వేదిస్తూ ఉండడం గురించి సునీల్ గవాస్కర్ స్పందించాడు. గత సీజన్లో ఏం జరిగింది అన్నది మర్చిపోవాలి. ఈ సీజన్లో తిరిగి పుంజుకుంటామని బలంగా నమ్మాలి. బుమ్రాను ముంబై మిస్ చేసుకుంది. అయితే మరోసారి ఛాంపియన్గా నిలిచే జట్టు వారికి ఉంది. తప్పకుండా పాయింట్ల పట్టికలో టాప్ త్రీ లో ముంబైని చూస్తాం అంటూ సునీల్ గవాస్కర్  అభిప్రాయపడ్డాడు. కాగా ఏప్రిల్ 2వ తేదీన ఆర్సిబి జట్టుతో మొదటి మ్యాచ్ ఆడబోతుంది ముంబై ఇండియన్స్.

ఇకపోతే ఇప్పటివరకు అటు ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచి ఎవరికి సాధ్యం కానీ రికార్డును సృష్టించింది. అలాంటి ఛాంపియన్ జట్టు గత ఏడాది మాత్రం పేలవమైన ప్రదర్శన చేసింది. వరుస ఓటమితో సతమతమై పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది అని చెప్పాలి. ఇక ఈసారి ముంబై ఇండియన్స్ ఎలా పుంజుకొని కం బ్యాక్ ఇస్తుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: