వికెట్లు తీయడంలో.. బుమ్రాను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు వరుసగా అంతర్జాతీయ షెడ్యూల్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లకు రెస్టు లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్లేయర్లు అటు పెళ్లి చేసుకుని నేరుగా టీమిండియాలో ఆడటానికి వస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అటు తన ప్రియురాలు అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న కేఎల్ రాహుల్ వెంటనే టీమిండియాలో వచ్చి చేరాడు. ఇక మరో క్రికెటర్ అక్షర్ పటేల్ సైతం తన గర్ల్ ఫ్రెండ్ మేహ పటేల్ ని పెళ్లి చేసుకుని అటు వెంటనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగం అయ్యాడు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరిలో కేఎల్ రాహుల్ వరస్ట్ పర్ఫార్మర్గా విమర్శలు ఎదుర్కొంటే.. అక్షర్ పటేల్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

 టాప్ ఆర్డర్ విఫలమై జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నాగపూర్ టెస్టులో 84 పరుగులు చేసిన అక్షర్ పటేల్ ఢిల్లీ టెస్టులో 74 పరుగులు చేశాడు. ఇక అహ్మదాబాద్ టెస్టులో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఒకవైపు బ్యాటింగ్లో అదరగొడుతూనే మరోవైపు బౌలింగ్ లోకి కూడా సత్తా చాటాడు. నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో ఐదు ఇన్నింగ్స్ లో కలిపి 264 పరుగులు చేశాడు అక్షర్ పటేల్. సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా కూడా అక్షర్ పటేల్ నిలిచాడు అని చెప్పాలి. అదే సమయంలో ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అక్షర్ పటేల్.

 నాగపూర్ టెస్టులో  28 ఓవర్లు వేసి ఒకరి వికెట్ తీసాడు. 150 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా ను ఎల్పీడబ్ల్యుగా అవుట్ చేసిన అక్షర పటేల్.. 2 వ ఇన్నింగ్స్ లో మాత్రం ట్రావిస్ హెడ్ ను సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు అని చెప్పాలి. అయితే ట్రావిస్ హెడ్ వికెట్ తీయడం ద్వారా తన కెరియర్ లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు అక్షర్ పటేల్. ఇక బంతుల వారీగా చూసుకుంటే మాత్రం అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా అక్షర్ పటేల్  అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అక్షర్ పటేల్ 225 బంతుల్లో 50 వికెట్లు తీయగా బుమ్రా 2465 బంతుల్లో ఈ రికార్డు సాధించాడు. కర్సన్ గార్వి 2534 బంతుల్లో, రవిచంద్రన్ అశ్విన్ 2597 బంతుల్లో 50 వికెట్లను అందుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: