విశ్వవిజేతను మట్టికరిపించిన పసికూన.. ఇది నిజంగా ఊహించనిది?

praveen
సాధారణంగా ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న ఒక టీం కి ఇక పసికూనగా ఉన్న మరో టీం తో పోటీ జరిగినప్పుడు ఎంతో అలవోకగా పటిష్టమైన జట్టు విజయం సాధిస్తుందని అందరూ నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం పసికూన జట్లు అద్భుతమైన ప్రదర్శన చేసే ఛాంపియన్ టీం లకు షాక్ ఇస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా జరిగిందంటే చాలు అదే ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ కూ కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి.

 2022 టీ20 వరల్డ్ కప్ విన్నర్గా నిలిచిన ఇంగ్లాండ్కు పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఊహించని చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్లు గెలవడం ద్వారా సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా రెండో టి20 లో నాలుగు వికెట్ల తేడాతో విశ్వవిజేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకొని దెబ్బ కొట్టింది అని చెప్పాలి. తొలి రెండు టీ20 మ్యాచ్ లో వరుస విజయాలు సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంత గడ్డపైనే ప్రత్యతిని దెబ్బ కొట్టింది పసికూన బంగ్లాదేశ్.

 ప్రపంచ క్రికెట్లో బంగ్లా టైగర్స్, అండర్ డాగ్స్ అంటూ తమపై ఉన్న ముద్రను మరోసారి ఆ జట్టు ఆటగాళ్లు కొనసాగించారు అని చెప్పాలి. ఇక రెండో టి20 లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ చేసింది బంగ్లాదేశ్. 117 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు రాబట్టేందుకు నానా తండాలు పడ్డారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత తక్కువ లక్ష్యంతోనే బలులోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 18.5 ఓవర్లలోనే ఎంతో అలవోకగా టార్గెట్ చేదించి విజయాన్ని సాధించింది. చిన్న లక్ష్యం కావడంతో బంగ్లా టైగర్స్ ఏమాత్రం భయం పేరుకు లేకుండా ఆడారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: