ఆ విషయం.. రోహిత్ కి చిరాకు తెప్పించి ఉంటుంది : మంజ్రేకర్

praveen
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత జట్టు సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం తప్పనిసరిగా మారిపోయింది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి.  అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అహ్మదాబాద్ లోకి బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్నంతగా ఇక ఇతర ఏ వేదిక కూడా అనుకూలంగా ఉండదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో కూడా స్పిన్నర్ లు బ్యాట్స్మెన్ లపై ఆధిపత్యం చెలాయించారు.

 అయితే ఇక ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో మాత్రం బ్యాట్స్ మెన్ లదే  హవా నడుస్తూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 480 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత భారత జట్టు ఆ టార్గెట్ ను చేదిస్తుందా లేదా అని అనుకున్నప్పటికీ మరింత అద్భుతంగా ఆడిన భారత జట్టు ఏకంగా 570 పరుగులు చేసి 91 పరుగుల ఆదిక్యంలోకి వచ్చింది అని చెప్పాలి.

 గిల్, విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీలతో చెలరేగిపోయారు అని చెప్పాలి. ఇంకా మిగతా బ్యాట్స్మెన్లు కూడా ఎవరు తక్కువ కాదు అన్నట్లుగా మంచి ప్రదర్శన చేశారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ బ్యాటింగ్ పిచ్ పై పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 35 పరుగులకే  అవుట్ అయ్యాడు. ఇదే విషయంపై సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత మైదానంలో నుంచి బయటకు వెళ్లేందుకు అతని కాళ్లు ముందుకు పడలేదు. కఠినమైన పిచ్ లపైన చాలా బాగా ఆడతాడు. అందుకు ఉదాహరణ తొలి టెస్టులో సెంచరీ సాధించడమే. అలాంటి రోహిత్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై త్వరగా అవుట్ కావడం మాత్రం అతనికి చిరాకు తెప్పించి ఉంటుంది అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: