ఆసిస్ ఆల్రౌండర్కి చుక్కలు చూపించిన తెలుగు తేజం?

Purushottham Vinay
మన తెలుగు తేజం ఎట్టకేలకు అదరగొట్టాడు.గతం నుంచి వికెట్‌ కీపింగ్‌లో అదరగొడుతున్నా కూడా బ్యాటింగ్‌లో నిరాశపరుస్తోన్న టీమిండియా వికెట్‌ కీపర్‌ కే.ఎస్‌.భరత్ ఆసీస్‌పై సూపర్  ఇన్నింగ్స్‌ ఆడాడు.ఇక అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు భరత్‌. మొత్తం 88 బంతులు ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు ఇంకా అలాగే 3 సిక్స్‌లతో 44 రన్స్‌ చేసి లయోన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే అతను కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంకా అంతేకాదు ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు కాసేపు ఇతను చుక్కలు చూపించాడు. గ్రీన్‌ వేసిన ఒక ఓవర్‌లో వరసగా ఏకంగా 6,6,4 కొట్టి అందరికీ షాకిచ్చాడు.ఇక ఆ ఓవర్‌లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. భరత్ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా అర్ధసెంచరీ చేస్తాడనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ లయోన్‌కు భరత్ చిక్కాడు. 


ఇక కామెరూన్‌ గ్రీన్‌ ఐపీఎల్‌ వేలంలో ఏకంగా రూ.17.50 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే.ఇక రిషబ్ పంత్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్‌ కీపింగ్‌లో తన ట్యాలెంట్ ని చూపిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అతను పెద్దగా రాణించలేదు. అయితే 4వ టెస్టులో వేగంగా పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు బాట వేశాడు.తరువాత మ్యాచ్‌ విషయానికొస్తే..  టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి మొత్తం 563 పరుగులు చేసింది.ఇక విరాట్ కోహ్లీ 183 పరుగులతో డబులు సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. అక్షర్‌ పటేల్‌ మొత్తం 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 83 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఐతా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడం జరుగుతుంది .KS భరత్ దూకుడుగా ఆడిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: