గిల్ సెంచరీ.. ఎక్స్ ప్రెషన్ కింగ్ కోహ్లీ రియాక్షన్ వైరల్?

praveen
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా చట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా రసవత్తరమైన పోరు కోరుకొనసాగుతూ ఉంది అని చెప్పాలి. మొదటి రెండు మ్యాచ్లలో ఘనవిజయాలను సాధించిన టీమ్ ఇండియా జట్టు మూడో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుంది అని భావించినప్పటికీ అలా జరగలేదు. అద్భుతంగా పుంజుకున్న ఆస్ట్రేలియా జట్టు మూడో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

 దీంతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ అటు టీమిండియా డు ఆర్ డై మ్యాచ్ గా  మారిపోయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. సిరీస్ సొంతం  కావడమే కాదు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెట్టే ఛాన్స్ దక్కుతుంది. ఇలాంటి సమయంలో అటు ఆస్ట్రేలియా జుట్టు అద్భుతంగా రానుంచి ఏకంగా 480 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ భారీ టార్గెట్ ను ఛేదించేందుకు అటు టీమిండియా బరిలోకి దిగింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో 35 పరుగులకే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. దీంతో మంచి ఆరంభం లభించలేదు అని అభిమానులు నిరాశలో మునిగిపోయారూ.

 74 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయి టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. అయితే మూడో మ్యాచ్లో విఫలమైన గిల్ రాణిస్తాడని నమ్మకం కూడా ఎవరిలో లేదు. ఇలాంటి సమయంలో తన ప్రతిభకు సానపెట్టాడు  గిల్. అద్భుతమైన ప్రదర్శన చేసే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు బౌండరీల  మోత మోగించాడు. 235 బంతుల్లో 18 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 128 పరుగులు చేశాడు గిల్. ఈ క్రమంలోనే జట్టుకు మంచి శుభారంభం  అందించిన గిల్ పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. గిల్ సెంచరీ చేయగానే ఆనందంతో ఊగిపోయి చిరునవ్వు చిందిస్తూ చప్పట్లతో ప్రశంసలు కురిపించాడు కోహ్లీ. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: