సూపర్ సెంచరీ.. కోహ్లీకి సాధ్యం కానీ రికార్డ్ గిల్ సొంతం?

praveen
గత కొంతకాలం నుంచి యువ ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న పరిమిత ఓవర్ల ఫార్మట్లో సెంచరీలు, డబుల్ సెంచరీలు అంటూ వరుసగా భారీ ఇన్నింగ్స్ లు ఆడి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు. అంతేకాకుండా ఇక భారత క్రికెట్లో ఫ్యూచర్ స్టార్ ఎవరో కాదు అది నేనే.. క్రికెట్ను శాసించేది నేనే అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభ పై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి.

 అలాంటి శుభమన్ గిల్ ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా భారత జట్టులోకి వచ్చాడు అయితే మొదటి నుంచి భారత తుది జట్టులో చోటు సంపాదించుకుంటున్న కే ఎల్ రాహుల్ అంచనాలకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయలేదు. వరుసగా విఫలం అవుతూనే వచ్చాడు. దీంతో ముందుగా అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి తర్వాత జట్టు నుండి వేటు వేశారు. ఇక అతని స్థానంలో శుభమన్ గిల్ ను తీసుకున్నారు. అయితే మూడో మ్యాచ్లో శుభమన్ గిల్ కూడా ఎక్కడ తన బ్యాట్ తో ప్రభావం చూపు లేకపోయాడు. దీంతో అతనిపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారీ టార్గెట్ చేదించాల్సి ఉన్న సమయంలో తన ప్రతిభకు పని చెప్పాడు అని చెప్పాలి.

 ఏకంగా ఓపెనర్ గా  బరిలోకి దిగి సెంచరీ చేసేసాడు అని చెప్పాలి. అయితే ఇక శుభమన్ గిల్ సాధించిన ఈ సెంచరీ ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదవ క్రికెటర్ గా నిలిచాడు శుభమన్ గిల్. ఇక భారత క్రికెట్లో నాలుగో ప్లేయర్గా నిలిచాడు. ఇక ఈ ఏడాది ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు వరకు భారత క్రికెట్ నుంచి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సురేష్ రైనా మాత్రమే ఒక ఏడాదిలో అన్ని ఫార్మట్ లలో సెంచరీ చేసిన ప్లేయర్లుగా ఉండగా ఇక ఇప్పుడు శుభమన్ గిల్ సైతం వీరి సరసన చేరిపోయాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఈ రికార్డు సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: