కోహ్లీ కెప్టెన్సీలో ఏడేళ్లలో 2 సార్లు.. రోహిత్ మాత్రం 24 గంటల్లోనే?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా మారిపోయింది. మొదటి రెండు మ్యాచ్లలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత రెండు మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాలో  ఓటమి భయాన్ని కలిగిస్తూ ఉంది అని చెప్పాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలని ఎంతో ఆశపడుతున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాలని కంగారుల జట్టు ఉవ్విల్లూరుతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే మూడో టెస్ట్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజృంభించింది. ఏకంగా 480 పరుగుల భారీ స్కోరు చేసి ఇక టీమ్ ఇండియాలకు పెద్ద సవాలు విసిరింది అని చెప్పాలి. అయితే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక కొంతమంది రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ట్రోల్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ని పోల్చుతూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

 అయితే సొంత గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకుండానే సెషన్ ముగియడం కోహ్లీ కెప్టెన్సీలో ఏడేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే జరిగింది. కానీ రోహిత్ శర్మ సారధ్యంలో మాత్రం 24 గంటల్లోనే రెండుసార్లు జరగడం గమనార్హం. దీనినే తెరమీదకి తెస్తూ ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి పనికిరాడు అంటూ విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు రోహిత్ ఏం చేస్తున్నాడు అంటూ కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక మరి కొంతమంది ఇలా ఎవరు ఏం సాధించారు అనే రికార్డులను పక్కనపెట్టి టీమిండియా గెలవాలని మద్దతు పలికితే బాగుంటుందని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: