ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ కూడా కొనుక్కోవచ్చు?

praveen
2023 ఐపీఎల్ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పొందేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులందరూ  కూడా సిద్ధమైపోతున్నారు. ఇక ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. మార్చ్ 31 వ తేదీ నుంచి ఇక ఈ రిచ్ లీగ్ కి సంబంధించిన మ్యాచులు జరగబోతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇక మరికొన్ని రోజుల్లో మ్యాచ్లు జరగబోతున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కూడా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలు సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి.

 సాధారణంగానే ఇక ఐపీఎల్ ప్రతి సీజన్లో కూడా ప్రతి ఫ్రాంచైజీ తమ జెర్సీ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ బలిలోకి దిగుతూ ఉంటుంది. ఇక ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ  కొత్త జెర్సీ వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్  సైతం తమ కొత్త జెర్సీని ఇటీవల సోషల్ మీడియా వేదిక విడుదల చేసింది. కొత్త జెర్సీ చూస్తే జెర్సీలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ముంబై విడుదల చేసిన ఫోటోలు చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చిరునవ్వులు చిందిస్తూ ఉండడం కనిపిస్తుంది.

 అంతేకాదు ఇక ఈ కొత్త జెర్సీని ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాము అన్న విషయాన్ని వెల్లడించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఇకపోతే గత ఏడాది ఐపీఎల్ సీజన్లు పేలవా ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో జట్టును పటిష్టంగా మార్చుకునేందుకు కొత్త ఆటగాళ్లను కూడా టీంలోకి తీసుకుంది అని చెప్పాలి. ఇప్పుడు బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా పటిష్టంగా కనిపిస్తోంది ముంబై ఇండియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: