నాలుగో టెస్ట్ మ్యాచ్.. టాస్ వేయబోతున్న పీఎం మోడీ?

praveen
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్ లలో కూడా ఆస్ట్రేలియా, భారత్ తలబడుతున్నాయ్. ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. కాగా రెండు మ్యాచ్లలో భారత జట్టు విజయం సాధిస్తే మూడో మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇకపోతే అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయాన్ని తెలిసిందే. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. చివరి టెస్ట్ మ్యాచ్లో గెలుపుతో అటు సిరీస్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా కాలు పెట్టాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

 అంతేకాదు ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అటు ఆస్ట్రేలియా ప్రధానితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్టేడియం కు వచ్చి నేరుగా మ్యాచ్ వీక్షించబోతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు కూడా భారీగా తరలిరాబోతున్నారు అన్నది ప్రస్తుతం క్రికెట్ నిపుణుల అంచన. ఇకపోతే అహ్మదాబాద్ వేదికగా జరగబోయే టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక నేడు ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా మైదానంలోకి వచ్చి టాస్ వెయ్యబోతున్నారు అని సమాచారం. అంతేకాకుండా నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని అంథోని ఆల్బర్ట్  తొలి రోజు ఆట పూర్తయ్యే వరకు కూడా ఇక మైదానంలోనే ఉండి మ్యాచ్ ను వీక్షించబోతున్నారట. ఇక రెండు దేశాల ప్రధానులు ఒక్కచోట కలుస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్ స్టేడియం చుట్టూ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అన్నది తెలుస్తుంది. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న విషయం తెలుసుకునేందుకు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: