ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం.. నామినేట్ అయింది వీళ్లే?

praveen
ఇటీవల కాలంలో ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఐసిసి తరచూ ఏదోక అవార్డును ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎన్నో రోజుల నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా ప్రకటించడం చేస్తూ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. గత నెలకు సంబంధించి మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ల లిస్టును షార్ట్ లిస్ట్ గా మార్చి ఇక అవార్డు కోసం కొంతమంది ఆటగాళ్ళను నామినేట్ చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఐసిసి ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకునేది ఎవరు అన్నది ప్రతి నెల కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.

 ఇటీవల కాలంలో ఎంతో మంది భారత ఆటగాళ్లు సత్తా చాటుతు ఇక ప్రతి నెల కూడా ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి మంచి ఫామ్ కనబరిచిన ఆటగాళ్లను సెలెక్ట్ చేసి మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించేందుకు సిద్ధమైంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఈ అవార్డు కోసం నామినేట్ అయిన ఆటగాళ్ల వివరాలను ఇటీవల ప్రకటించింది అని చెప్పాలి. ఇలా ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ఫామ్ కనబరిచిన మెన్ క్రికెటర్ల లిస్టును విడుదల చేసింది.

 ఈ అవార్డు రేసులో భారత జట్టు నుంచి సూపర్ ఫాం కనబరుస్తున్న ఆల్రౌండర్ రవీంద్ర నామినేట్ అయ్యాడు అని చెప్పాలి. అంతేకాకుండా బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తున్న ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారి బ్రూక్స్ సైతం ఇక అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. వెస్టిండీస్ ప్లేయర్ గూడాకేష్ మోటి కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం నామినేట్ కావడం గమనార్హం. ఇక ఈ ముగ్గురిలో ఎవరికి అవార్డు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: